బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) శుక్రవారం వరంగల్ భద్రకాళి ఆలయాన్ని(Bhadrakali Temple in Warangal) సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రేపు భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) వరంగల్ పర్యటనకు రానున్నట్లు తెలిపారు. ఓరుగల్లు నగరం దేశంలోనే సాంస్కృతిక వైభవానికి ముడిపడినటువంటి నగరం అన్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

BJP Telangana Chief Kishan Reddy

వరంగల్ నగరానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేయడం.. చాలా ప్రాధాన్యతతో కూడిన విషయమన్నారు. వరంగల్ ప్రజల ఆశీస్సుల కోసం నరేంద్ర మోదీ నగరానికి రానున్నారని వ్యాఖ్యానించారు. రేపు భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని మిగతా కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు ప్రధాని వెల్లడించారు. 30 సంవత్సరాలుగా ఏ ప్రధాని వరంగల్ నగరానికి రాలేదని అన్నారు. ప్రధాని పర్యటన నగరానికి కొత్త తేజస్సును తీసుకురానుందని పేర్కొన్నారు. ఎంతో చరిత్ర కలిగిన కాకతీయుల నగరాన్ని.. మరింత అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లనుందని అన్నారు.