బీజేపీ(BJP) బహిష్కృత‌నేత‌, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja singh) పార్టీ మార‌నున్నార‌నే వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. గ‌తంలో రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా ఉన్న రాజాసింగ్‌పై వివాదాస్పద వ్యాఖ్యల కార‌ణంగా బహిష్కరణ(Suspended) వేటు ప‌డింది. అయితే..

బీజేపీ(BJP) బహిష్కృత‌నేత‌, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja singh) పార్టీ మార‌నున్నార‌నే వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. గ‌తంలో రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా ఉన్న రాజాసింగ్‌పై వివాదాస్పద వ్యాఖ్యల కార‌ణంగా బహిష్కరణ(Suspended) వేటు ప‌డింది. అయితే.. ఆరు నెలలు దాటినా.. బీజేపీ అధిస్టానం ఆయ‌న‌ను పట్టించుకోవ‌డంలేదు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో రాజాసింగ్ వేరే పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. త‌న‌కు రాజ‌కీయంగా జ‌న్మ‌నిచ్చిన టీడీపీలో ఎమ్మెల్యే రాజాసింగ్ చేర‌నున్నార‌నేది వార్తాల సారాంశం. రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ను కలిసి చర్చలు జరిపినట్లుగా కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. మరో రెండు మూడు రోజుల్లో చేరిక‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వెలువ‌డుతున్నాయి. వార్త‌ల‌పై రాజా సింగ్‌, టీడీపీ ల నుంచి ఎటువంటి స్పంద‌న లేక‌పోవ‌డం విశేషం.

ఎమ్మెల్యే రాజాసింగ్‌ 2009లో టీడీపీలో చేరారు. టీడీపీ తరపున 2009 నుంచి 2014 వరకు కార్పొరేటర్‌గా పనిచేశారు. తర్వాత బీజేపీలో చేరి 2014లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్‌ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ నుంచి వరుసగా రెండోసారి గెలిచారు. 2018 ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఒకేఒక ఎమ్మెల్యే రాజాసింగ్. ఆ త‌ర్వాత జ‌రిగిన ఉప ఎన్నిక‌ల‌లో గెలిచి ఈటెల రాజేంద‌ర్‌, ర‌ఘునంద‌న్ రావులు రాజాసింగ్‌తో జ‌త‌క‌ట్టారు. వీరిని ఆర్ఆర్ఆర్ గా కూడా పిలిచేవారు.

Updated On 28 April 2023 7:34 AM GMT
Ehatv

Ehatv

Next Story