బీజేపీ(BJP) బహిష్కృత నేత, గోషామహల్(Goshmahal) ఎమ్మెల్యే రాజా సింగ్(Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను సచ్చినా సెక్యులర్ పార్టీలకు(Secular Parties) వెళ్ళనని అన్నారు. నా ప్రాణం పోయినా బీఆర్ఎస్(BRS) , కాంగ్రెస్(congress) పార్టీలకు పోను అని స్పష్టం చేశారు.
బీజేపీ(BJP) బహిష్కృత నేత, గోషామహల్(Goshmahal) ఎమ్మెల్యే రాజా సింగ్(Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను సచ్చినా సెక్యులర్ పార్టీలకు(Secular Parties) వెళ్ళనని అన్నారు. నా ప్రాణం పోయినా బీఆర్ఎస్(BRS) , కాంగ్రెస్(congress) పార్టీలకు పోను అని స్పష్టం చేశారు. తెలంగాణను హిందు రాష్ట్రం చేయాలని నా లక్ష్యం అని పేర్కొన్నారు. బీజేపీ నాకు టికెట్ ఇవ్వకుంటే.. రాజకీయాలు పక్కన పెట్టి నేను హిందు రాష్ట్రం కోసం పని చేసుకుంటానని వెల్లడించారు.
గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ ఎంఐఎం చేతిలో ఉంది.. అందుకే పెండింగ్ పెట్టారని కామెంట్ చేశారు. దారుసలామ్ నుంచి గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేస్తారని ఎద్దేవా చేశారు. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను కానీ. .ఇండిపెండెంట్ గా కానీ.. వేరే పార్టీల నుంచి పోటీ చేయను అని స్పష్టం చేశారు. బీజేపీ అధిష్టానం నాపై సానుకూలంగా ఉందన్న రాజా సింగ్.. సరైన సమయం చూసి నాపై సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తారని చెప్పారు.