భారతీయ జనతా పార్టీ(BJP) తెలంగాణలో తొమ్మిది లోక్‌సభ అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేసింది. ఈ జాబితాపై టికెట్‌ ఆశించి భంగపడిన నేతలు విరుచుకుపడుతున్నారు. హైదరాబాద్ లోక్‌సభ టికెట్‌పై ఎప్పటి నుంచో కన్నేసిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌(Raja singh) తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తనను కాదని విరంచి హాస్పిటల్‌(Virinchi Hospital) యజమాని, స్థానికేతర మహిళ కొంపెల్ల మాధవిలతకు(Kompella Madhavilatha) టికెట్‌ ఇవ్వడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు.

భారతీయ జనతా పార్టీ(BJP) తెలంగాణలో తొమ్మిది లోక్‌సభ అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేసింది. ఈ జాబితాపై టికెట్‌ ఆశించి భంగపడిన నేతలు విరుచుకుపడుతున్నారు. హైదరాబాద్ లోక్‌సభ టికెట్‌పై ఎప్పటి నుంచో కన్నేసిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌(Raja singh) తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తనను కాదని విరంచి హాస్పిటల్‌(Virinchi Hospital) యజమాని, స్థానికేతర మహిళ కొంపెల్ల మాధవిలతకు(Kompella Madhavilatha) టికెట్‌ ఇవ్వడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. కరోనా సమయంలో ఇష్టం వచ్చినట్టుగా బిల్లులు వేసి అప్రతిష్టను మూటగట్టుకున్న సంగతి ప్రజలందరికీ తెలుసని రాజాసింగ్‌ అన్నారు. విరించి హాస్పిటల్‌లో వైద్యాన్ని ప్రభుత్వం నిలిపివేసిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో దింపడానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి(Kishan Reddy) మగాడే దొరకలేదా అంటూ తీవ్ర విమర్శలు చేశారు రాజాసింగ్‌. సోషల్‌ మీడియాలో సొల్లు కబుర్లు చెప్పడమే తప్ప ఆమె ఇప్పటికీ పార్టీలో చేరలేదని, అలాంటామెకు టికెట్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జహీరాబాద్‌, నాగర్‌ కర్నూల్‌, మల్కాజ్‌గిరి లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక పట్ల కూడా చాలా మంది అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. ఆదిలాబాద్‌ సిట్టింగ్‌ ఎంపీ సోయం బాపురావు పేరు తొలి జాబితాలో లేకపోవడం పట్ల ఆయన కూడా గుర్రుగా ఉన్నారట! ఆదివాసీ నాయకుడినైన తనకు టికెట్‌ దక్కకుండా పావులు కదిపారని సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారట! తాను ఎక్కడ గెలుస్తానోననే భయం కొందరికి పట్టుకుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బాపురావు. అలాగే మల్కాజ్‌గిరి టికెట్‌ ఆశించిన పొల్సాని మురళీధర్‌ రావు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. త్వరలో తన అనుచరులతో సమావేశమయ్యి భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ క్యాడర్‌లో నెలకొంది. నాగర్‌ కర్నూల్‌ లోక్‌సభ టికెట్‌ కోసం చాన్నాళ్లుగా సీరియస్‌గా ప్రయత్నిస్తున్న బంగారు లక్ష్మణ్‌ కూతురు బంగారు శ్రుతి కూడా అసంతృప్తితో ఉన్నారు.

Updated On 4 March 2024 1:23 AM GMT
Ehatv

Ehatv

Next Story