రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో జేపీ నడ్డా తెలంగాణ లో చేయనున్న ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ 31 న జేపీ నడ్డా సంగారెడ్డిలో జీజేపీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అక్కడి నుంచే వర్చువల్ గా మరో 5 జిల్లాల పార్టీ కార్యాలయాలను నడ్డా ప్రారంభిస్తారని బీజేపీ నేతలు తెలిపారు.
తెలంగాణలో ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరుగుతుండటంతో బీజేపీ(BJP) నేతలు తెలంగాణ రాష్ట్రంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే బీజేపీ పార్టీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ కేంద్రంలో బీజేపీకి తామే ప్రత్యామ్నాయం అంటూ ముందుకు వెళుతున్న నేపథ్యంలో తెలంగాణలోనే ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీయాలన్న వ్యూహంలో కమలనాధులున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అయిన అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ నేపధ్యంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (jp Nadda) తెలంగాణ లో పర్యటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 31న సంగారెడ్డిలో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో జేపీ నడ్డా తెలంగాణ లో చేయనున్న ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ 31 న జేపీ నడ్డా సంగారెడ్డిలో జీజేపీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అక్కడి నుంచే వర్చువల్ గా మరో 5 జిల్లాల పార్టీ కార్యాలయాలను నడ్డా(J.P.Nadda) ప్రారంభిస్తారని బీజేపీ నేతలు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో లిక్కర్ స్కాం , టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ తో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో అధికార బీఆర్ఎస్ పై అస్త్రాలుగా సంధించేందుకు బీజేపీ ప్లాన్స్ (Plans) రెడీ చేసుకొని ఉద్యమించేందుకు సిద్ధం అవుతోందని తెలుస్తోంది. అయితే ఇలాంటి సందర్భంలోనే నడ్డా తెలంగాణ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో ఏ మార్పు కు దారితీస్తుందోనన్న ఉత్కంఠ కూడా నెలకొంది . ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , ఎంపీ అర్వింద్ ,లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటు ముఖ్య నేతలతో నడ్డా సమావేశం అయినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు , బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు , ప్రజానాడీ ఏ విధంగా ఉంది....అన్న అంశాలను నేతలను అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం .టీఎస్‌పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో నిరుద్యోగులకు అండగా ఉద్యమాలు తీవ్రతరం చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. లిక్కర్ స్కాం లో కవిత విచారణతో బీఆర్ఎస్ ఎదురుదాడిని సమర్ధంగా తిప్పి కొట్టాలని ఆయన నేతలకు దిశానిర్ధేశం చేసినట్లు తెలుస్తోంది.