ఏపీలో రాజకీయ విమర్శలు పదునెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఈ క్రమంలో రాజంపేట బీజేపీ(BJP) ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి(Kiran Kumar Reddy), పెద్దిరామచంద్రారెడ్డి(Peddiramachandra Reddy) మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. నిన్నటివరకూ పెద్దిరెడ్డి తీవ్రస్థాయిలో కిరణ్ కుమార్ పై ఆరోపణలు చేయగా.. తాజాగా మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ కాళ్లు పట్టుకుని కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యారని ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కిరణ్ కుమార్ గట్టి కౌంటర్ ఇచ్చారు
ఏపీలో రాజకీయ విమర్శలు పదునెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఈ క్రమంలో రాజంపేట బీజేపీ(BJP) ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి(Kiran Kumar Reddy), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddiramachandra Reddy) మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. నిన్నటివరకూ పెద్దిరెడ్డి తీవ్రస్థాయిలో కిరణ్ కుమార్ పై ఆరోపణలు చేయగా.. తాజాగా మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ కాళ్లు పట్టుకుని కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యారని ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కిరణ్ కుమార్ గట్టి కౌంటర్ ఇచ్చారు
తాను ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టుకొని పదవి తెచ్చుకోలేదని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కానీ పదవుల కోసం పెద్దిరెడ్డి తన కాళ్లు పట్టుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో డీసీసీ(DCC) అధ్యక్ష పదవి కోసం పెద్దిరెడ్డి తన కాళ్లు పట్టుకున్నారని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ విషయంపై తాను ఎక్కడైనా ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. కాణిపాకం లేదా తరిగొండలో ప్రమాణానికి సిద్ధమా..? అని ఈ సందర్భంగా పెద్దిరెడ్డిని ప్రశ్నించారు గతంలో డీసీసీ అధ్యక్ష పదవి కోసం పద్మావతి గెస్ట్ హౌస్‌లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కాళ్లు రెండు సార్లు పట్టుకున్నారని కిరణ్‌కుమారెడ్డి అన్నారు. అదే సమయంలో తన నియోజకవర్గానికి చెందిన 50 మంది కార్యకర్తలు కూడా అక్కడే ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్‌లో ఉండగా తాను మంత్రి పదవిని మాత్రమే ఆశించినట్లు చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత ప్రభుత్వ విప్.. అటు తర్వాత శాసనసభ స్పీకర్, ముఖ్యమంత్రి పదవులు దక్కాయని చెప్పుకొచ్చారు. అనుకోకుండా అన్ని పదవులు పొందానని వివరించారు. ఇటీవల పుంగనూరులో మాట్లాడిన పెద్దిరెడ్డి.. జగన్‌ను కిరణ్‌కుమార్‌రెడ్డి గతంలో వేధించి జైలుకు పంపారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి కిరణ్‌కుమార్‌రెడ్డే కారణమన్న ఆయన రాష్ట్ర విభజనకు కూడా ఆయనే కారణమన్నారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేసి బీజేపీలో చేరిన చరిత్ర కిరణ్‌కుమార్‌రెడ్డిదని.. సీఎంగా ఉన్నా ఈ ప్రాంతానికి నీరు కూడా రాకుండా అడ్డుకున్నారని పెద్దిరెడ్డి విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ పెద్దిరెడ్డిపై కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.