బీజేపీ(BJP) క్రమశిక్షణ కలిగిన పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ.. గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. క్రమశిక్షణ(Disciplane) ఉల్లంఘించిన వారి విషయంలో కఠినంగా ఉంటామని తెలిపారు

Bandi sanjay
బీజేపీ(BJP) క్రమశిక్షణ కలిగిన పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ.. గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. క్రమశిక్షణ(Disciplane) ఉల్లంఘించిన వారి విషయంలో కఠినంగా ఉంటామని తెలిపారు. టికెట్లు కావాలంటే ప్రజల మధ్య ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే వారికే ప్రాధాన్యతనిస్తామన్నారు. నిత్యం ప్రజలతో టచ్ లో ఉండే వారికి సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయిస్తామని తెలిపారు. క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటర్లను కలవకుండా షో చేస్తే టికెట్లు రావని అన్నారు.
