రాష్ట్ర బీజేపీ(BJP) మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) కి సొంత ఇల్లు లేదు. కేవలం తన పేరు మీద ఉన్న ఆస్తి 79.51 కోట్లు మాత్రమే. ఇదే విషయాన్ని బండి సంజయ్‌ తన నామినేషన్‌(Nomination) పత్రాలతో అఫిడవిట్‌(affidavit) సమర్పించారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌(Karim nagar) ఎంపీ బండి సంజయ్‌ మరోసారి కరీంనగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

రాష్ట్ర బీజేపీ(BJP) మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) కి సొంత ఇల్లు లేదు. కేవలం తన పేరు మీద ఉన్న ఆస్తి 79.51 కోట్లు మాత్రమే. ఇదే విషయాన్ని బండి సంజయ్‌ తన నామినేషన్‌(Nomination) పత్రాలతో అఫిడవిట్‌(affidavit) సమర్పించారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌(Karim nagar) ఎంపీ బండి సంజయ్‌ మరోసారి కరీంనగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. సోమవారం నాడు కరీంనగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.

ఎన్నికల సంఘానికి(Election Commission) సమర్పించిన అఫిడవిట్ ప్రకారం..బండి సంజయ్ పేరు మీద 79.51 లక్షల రూపాయల ఆస్తి ఉండగా.. 5.44 లక్షల రూపాయల అప్పు ఉంది. ఇక తన సతీమణి పేరు మీద
12.40 లక్షల రూపాయల ఆస్తి ఉన్నట్టు వెల్లడించారు. ఇక తన పేరు మీదగానీ, తన కుటుంబ సభ్యుల పేరుతోగానీ ఎలాంటి భూములు(Land) లేవని అఫిడవిట్‎లో పేర్కొన్నారు. అలాగే తనపై ఉన్న కేసుల వివరాలను కూడా అఫిడవిట్‎లో పొందుపరిచారు. అదే సమయంలో తనపై ఉన్న 30 కేసులు విచారణ దశలో ఉన్నాయని తెలిపారు.

బండి సంజయ్ ప్రస్తుతం ఎంపీగా(MP) ఉన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా మూడేళ్లపాటు కొనసాగారు. వార్డు కౌన్సిలర్, కార్పొరేటర్‌గా గెలిచిన నాయకులే కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు. కానీ ఒక జాతీయ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా, మూడేళ్లు అధ్యక్షుడిగా, ఐదేళ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఆస్తులు పెద్దగా లేకపోవడం ఆశ్చర్యమే. బండి సంజయ్‌ సతీమణి ఎస్‌బీఐలో ఉద్యోగిగా ఉన్నారు. అయితే ఆయన సంపాదన అంతా బినామీల పేరిట ఉందని ఆరోపిస్తున్నాయి విపక్షాలు.

ఎంపీ బండి సంజయ్ నామినేషన్ దాఖలుకు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ సర్కిల్‌(NTR Circle) నుంచి గీతా భవన్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ కొనసాగినంతసేపు జైశ్రీరాం, భారత్‌ మాతాకీ జై నినాదాలు మార్మోగాయి. బండి సంజయ్ స్వయంగా కారు నడుపుకుంటూ ఆర్వో ఆఫీస్‎కు చేరుకుని..నామినేషన్ దాఖలు చేశారు. బండి సంజయ్ నామినేషన్ కార్యక్రమానికి ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా అటెండ్ అయ్యారు.

Updated On 10 Nov 2023 8:12 AM GMT
Ehatv

Ehatv

Next Story