రాహుల్ గాంధీకి(Rahul gandi) రాష్ట్రం నుంచి ఫండ్స్ పంపేందుకు ఇక్కడి వ్యాపారులను సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth reddy) బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని మల్కాజిగిరి(Malkajgiri) బీజేపీ(BJP) ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్(Etela Rajendra) సంచలన ఆరోపణలు చేశారు.

Etela Rajendra Prasad
రాహుల్ గాంధీకి(Rahul gandi) రాష్ట్రం నుంచి ఫండ్స్ పంపేందుకు ఇక్కడి వ్యాపారులను సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth reddy) బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని మల్కాజిగిరి(Malkajgiri) బీజేపీ(BJP) ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్(Etela Rajendra) సంచలన ఆరోపణలు చేశారు. వ్యాపారులను రేవంత్ బెదిరిస్తున్న చిట్టా తయారవుతుందన్నారు. పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగినట్టు రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు ఈటల రాజేందర్. రాష్ట్రంలో అన్నీ తానేనని రేవంత్ విర్రవీగుతున్నారని, దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని మండిపడ్డారు ఆయన. ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడుతూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు ఈటల. నడమంత్రపు సిరిలా ముఖ్యమంత్రి పదవి వచ్చిన రేవంత్.. రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు ఊరుకోరన్నారాయన. మల్కాజిగిరిలో ఎవరు వచ్చినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా గెలిచేది బీజేపీయేనని ఈటల అన్నారు.
