మహారాష్ట్రలో(Maharashtra) బీజేపీ(BJP) కూటమికి తిరుగులేని విజయం నమోదైంది.
మహారాష్ట్రలో(Maharashtra) బీజేపీ(BJP) కూటమికి తిరుగులేని విజయం నమోదైంది. ఎన్డీఏ కూటమికి(NDA) స్పష్టమైన మెజార్టీ వచ్చింది. జార్ఖండ్‌లో(Jharkhand) కాంగ్రెస్(Congress), జేఎంఎం(JMM) కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్(andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan kalyan) ఎన్డీయే కూటమి తరపున ప్రచారం చేశారు. ఆయన ప్రచారానికి భారీ స్పందనే వచ్చింది. పవన్ కల్యాణ్ పూణె, బల్లార్ పూర్, డెగ్లూర్, షోలాపూర్, లాతూర్, నాందేడ్, విదర్భ నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. కాగా ఈ స్థానాలన్నింటిలోనూ బీజేపీ ఆధిక్యత కొనసాగిస్తోంది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth reddy) ప్రచారం చేసిన స్థానాల్లో కూడా బీజేపీదే హవా కొనసాగుతోంది. సీఎం రేవంత్ చంద్రాపుర్, రాజురా, డిగ్రాస్, వార్ధా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. నయాగావ్, భోకర్, షోలాపుర్‌ల్లో ప్రచార సభలు, రోడ్ షోల్లో పాల్గొన్నారు. అయితే ఆయా స్థానాల్లో బీజేపీ కూటమే ఆధిక్యంలో ఉందని సమాచారం.