నేడు బీజేపీ ముఖ్యనేతలు ఖమ్మం పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే, చేరికల సమన్వయ కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో జిల్లాకు నేతలు పయనమవుతున్నారు. పర్యటనలో భాగంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో నేతలు భేటీ అవనున్నారు.

BJP leaders going to visit Khammam today to meet Ponguleti Srinivasa Reddy
నేడు బీజేపీ(BJP) ముఖ్యనేతలు ఖమ్మం(Khammam) పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే, చేరికల సమన్వయ కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్(Etela Rajender) ఆధ్వర్యంలో జిల్లాకు నేతలు పయనమవుతున్నారు. పర్యటనలో భాగంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivasa Reddy)తో నేతలు భేటీ అవనున్నారు. ఈ క్రమంలోనే పొంగులేటిని బీజేపీలోకి ఆహ్వానించనుంది ఈటల బృందం. ఖమ్మం పర్యటనకు ఈటల రాజేందర్, రఘునందన్ రావు(Raghunandhan Rao), మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి(Vishweshwar Reddy), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(Komatireddy Rajagopal Reddy), రవీందర్ రెడ్డి(Ravinder Reddy) తదితరులు వెళ్లనున్నట్లు సమాచారం.
ఇదిలావుంటే.. పొంగులేటి ఏ పార్టీలోకి వెళ్తారనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్(BRS) బహిష్కరణ వేటు తర్వాత సొంత పార్టీ పెడతారనే ప్రచారం జరిగినా.. ఆ దిశగా ప్రయత్నాలేవి చేసినట్టుగా కనపడటం లేదు. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్(Congress) నుండి రాహుల్(Rahul Gandhi) టీం పొంగులేటితో భేటీ అయినట్టు.. వారి ముందు ఆయన కొన్ని డిమాండ్లు వుంచినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ భేటీపై ఎటు తేలలేదు. మొదటి నుండి జిల్లాలో కాంగ్రెస్‌తోనే ఉన్న ఓ వర్గం పొంగులేటి రాకను వ్యతిరేకిస్తున్నారనేది జిల్లా ప్రజల అబిప్రాయం.
కాంగ్రెస్ విషయం తెలాల్సివుండగా.. పార్టీకి పట్టులేని జిల్లాలపై ప్రధానంగా దృష్టి పెడుతున్న బీజేపీ.. ఖమ్మం కోటలో కాషాయ జెండాను ఎగురవేయాలని అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో పార్టీ విస్తరణకు కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీలకతీతంగా బలమైన శక్తిగా ఎదిగిన పొంగులేటిని పార్టీలోకి ఆహ్వానించేందుకు ఈ పర్యటన ఖరారు చేసినట్టు తెలుస్తోంది. పొంగులేటి కూడా పార్టీల ముఖ్య నేతలతో భేటీ అవుతున్నా.. ఇప్పుడే ఓ నిర్ణయానికి వచ్చేలా కనపడటం లేదు. కర్ణాటక ఫలితాల వరకూ వేచి చూసి.. తర్వాత నిర్ణయం ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.
