హైడ్రా(HYDRA) కూల్చివేతలపై భారతీయ జనతాపార్టీకి(BJP) స్పష్టమైన వైఖరీ లేనట్టుగా ఉంది.

హైడ్రా(HYDRA) కూల్చివేతలపై భారతీయ జనతాపార్టీకి(BJP) స్పష్టమైన వైఖరీ లేనట్టుగా ఉంది. ఏదైనా ఓ అంశంపై పార్టీ నేతలు మాట్లాడితే ఒకే రకంగా మాట్లాడాలి. కానీ బీజేపీలో మాత్రం హైడ్రా కూల్చివేతలపై ఎవరికి తోచినట్టుగా వారు మాట్లాడుతున్నారు. అంటే దీనిపై పార్టీకి స్పష్టమైన విధానమంటూ లేదని తెలుస్తోంది. మెదక్‌ ఎంపీ రఘునందనరావు(Raghunanda rao) అయితే హైడ్రా అద్భుతం అంటున్నారు. కూల్చివేతలను సమర్థిస్తున్నారు. అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చివేయాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. పనిలో పనిగా గత ప్రభుత్వాన్ని తిట్టిపోశారు. మరో ఎంపీ కిషన్ రెడ్డి మాత్రం కూల్చివేతలను తప్పుపడుతున్నారు. తంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు వాటిని కూల్చివేస్తున్నదని మండి పడ్డారు. ఇంకో ఎంపీ ఈటల రాజేందర్‌ కూడా హైడ్రా కూల్చివేతలపై మండిపడ్డారు. హైడ్రా పేరుతో సామాన్యులను, మధ్య తరగతివారిని భయపెట్టాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. 40, 50 ఏళ్ల క్రితమే ఎఫ్‌టీఎల్‌లో పట్టా భూములకు ప్రభుత్వ అనుమతులతో సామాన్యులు ఇళ్లు కట్టుకున్నారని, సాహెబ్‌నగర్, సరూర్ నగర్, ఫాక్స్‌సాగర్ వద్ద ప్రభుత్వం అనుమతులు ఇచ్చి ఇళ్లు కట్టిందని చెప్పారు.

Eha Tv

Eha Tv

Next Story