బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ఆమె ట్విటర్ పోస్టులో.. ఎన్నికలొచ్చాయి కదా.. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ ప్రజలకు మల్ల కనపడుతున్నారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ అధ్యక్షుడు(BRS President), సీఎం కేసీఆర్(CM KCR)పై బీజేపీ నాయకురాలు విజయశాంతి(Vijayashanthi) సోషల్ మీడియా(Social Media) వేదికగా విమర్శలు గుప్పించారు. ఆమె ట్విటర్ పోస్టులో.. ఎన్నికలొచ్చాయి కదా.. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ ప్రజలకు మల్ల కనపడుతున్నారని ఎద్దేవా చేశారు. గత 9 సంవత్సరాలల్ల కేసీఆర్ చేసిన అసత్య వాగ్దానాలను, మోసాలను, దుర్మార్గాలను, దోపిడీ ధోరణులను, ద్రోహాలను రాజకీయాలకు అతీతంగా మన తెలంగాణవాదులం నిరంతరం ఇప్పటికెల్లి జన సామాన్యానికి తెలియజెయ్యాల్సిన సందర్భం ఇదని ప్రజానీకానికి సూచించారు. 5 లక్షల కోట్ల అప్పు తెలంగాణ బిడ్డల నెత్తికి పెట్టి, లక్ష కోట్లకు పైగా పైసలు ఈ ముఖ్యమంత్రి కుటుంబం లూటీ చేసి, మల్లా మరోసారి వాళ్లని నమ్మమంటున్రు.. "జాగ్ రెహ్‌నా".. తెలంగాణ(Telangana) సర్వ జనులారా.. "తెలంగాణల దొంగలు పడ్డరు" 2014, 2018 ల (టీఆరెస్, కేసీఆర్ అండ్ కో.. అనే పేర్లతో).. 2023 అట్లా ఉండరాదు ఇప్పుడైనా.. అని రాసుకొచ్చారు. రాములమ్మ(Ramulamma) పోస్టుపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.