బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ, ఫైర్‌బ్రాండ్ విజయశాంతి(Vijayashanti) లేటెస్ట్‌గా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. పాతికేళ్ల రాజకీయ ప్రయాణం అంతా తనకు సంఘర్షణ మాత్రమే ఇచ్చిందని, ఏ రోజూ తాను పదవి కోరుకోలేదని అందులో తెలిపారు. తన పోరాటం తెలంగాణ బిడ్డల సంక్షేమం కోసమే తప్ప, బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకం కాదన్నారు.
బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ, ఫైర్‌బ్రాండ్ విజయశాంతి(Vijayashanti) లేటెస్ట్‌గా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. పాతికేళ్ల రాజకీయ ప్రయాణం అంతా తనకు సంఘర్షణ మాత్రమే ఇచ్చిందని, ఏ రోజూ తాను పదవి కోరుకోలేదని అందులో తెలిపారు. తన పోరాటం తెలంగాణ(Telangana) బిడ్డల సంక్షేమం కోసమే తప్ప, బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకం కాదన్నారు. కేసీఆర్(KCR) కుటుంబ దోపిడి, కొందరు బీఆర్‌ఎస్ నేతల అరాచకత్వంపైనే తప్ప, తనతో కలిసి తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అడ్డుపెట్టి పని చేసిన బీఆర్‌ఎస్ కార్యకర్తలపై మాత్రం కాదని ట్వీట్‌లో స్పష్టం చేశారు విజయశాంతి. ఆమె ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్ ఇలా ఉంది...' 25 సంవత్సరాల నా రాజకీయ ప్రయాణం, అప్పుడు ఇప్పుడు కూడా ఎందుకో సంఘర్షణ మాత్రమే నాకు ఇస్తూ వచ్చింది. ఏ పదవి ఏనాడు కోరుకోకున్న ఇప్పటికీ అనుకోకున్న కూడా ..అయితే ప్రస్తుతం ఇది తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన సత్యం. మన పోరాటం నాడు దశాబ్దాల ముందు తెలంగాణ ఉద్యమ బాట నడిచినప్పుడు, మొత్తం అందరూ తెలంగాణ బిడ్డల సంక్షేమం తప్ప, ఇయాల్టి బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకం అవుతాం అని కాదు.. నా పోరాటం నేడు ఒక కుటుంబదోపిడి, కొందరు బీఆర్‌ఎస్ నేతల అరాచకత్వంపై తప్ప, నాతో కలిసి తెలంగాణ ఉద్యమంలో ప్రాణం అడ్డుపెట్టి పని చేసిన బీఆర్‌ఎస్ కార్యకర్తలపై మాత్రం కాదు.. రాజకీయ పరంగా సందర్భానుసారంగా విభేదించినప్పటికీ, అన్ని పార్టీల మొత్తం తెలంగాణ బిడ్డలు సంతోషంగా, సగౌరవంగా ఎన్నటికీ ఉండాలనీ మన:పూర్వకముగా కోరుకోవడం మీ రాములమ్మ ఒకే ఒక్క ఉద్దేశం... ఎప్పటికీ' అంటూ రాసుకొచ్చారు విజయశాంతి. హరహర మహాదేవ్, జై తెలంగాణతో ట్వీట్ ముగించారు. గత కొంతకాలంగా బీజేపీ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు విజయశాంతి. బీజేపీలో తనకు సముచిత స్థానం ఇవ్వలేదని, తన శక్తి సామర్థ్యాలను పార్టీ సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక దశలో ఆమె బీజేపీ నుంచి బయటకు వస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే విజయశాంతిని బుజ్జగించేందుకు బీజేపీ అధిష్టానం ఆమెకు నిరసనల కమిటీ ఛైర్‌పర్సన్ పదవి అప్పగించింది. లేటెస్ట్‌గా విజయశాంతి చేసిన ట్వీట్ ఆసక్తికలిగిస్తోంది. బీఆర్‌ఎస్ కార్యకర్తలను ప్రస్తావించడంతో ఆమె చేసిన ఈ ట్వీట్ వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందా అని ఆమె అభిమానులు, బీజేపీ క్యాడర్, బీఆర్‌ఎస్ శ్రేణులు ఆలోచిస్తున్నారు.