కిడ్నాప్ అయ్యాడని భావిస్తున్న జనగాం బీజేపీ నేత తిరుపతిరెడ్డి ఎట్టకేలకు తిరిగి ఇంటికి వచ్చారు. ఆరురోజుల ఆజ్ఞాతం అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి రెడ్డి డీసీపీ కార్యాలయానికి వెళ్లారు. ఎమ్మెల్యే మైనంపల్లి నన్ను కిడ్నాప్ చేసి నన్ను చంపాలని తన అనుచరులతో ప్రయత్నించారని సంచలన ఆరోపణలు చేశారు.
కిడ్నాప్(Kidnap) అయ్యాడని భావిస్తున్న జనగాం బీజేపీ నేత తిరుపతిరెడ్డి(BJP Leader Tirupathi Reddy) ఎట్టకేలకు తిరిగి ఇంటికి వచ్చారు. ఆరురోజుల ఆజ్ఞాతం అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి రెడ్డి డీసీపీ కార్యాలయాని(DCP Office)కి వెళ్లారు. ఎమ్మెల్యే మైనంపల్లి(Mynampalli Hamumantha Rao) నన్ను కిడ్నాప్ చేసి నన్ను చంపాలని తన అనుచరులతో ప్రయత్నించారని సంచలన ఆరోపణలు చేశారు. నన్ను కొన్ని రోజులుగా కొందరు వెంబడిస్తున్నారు.. నన్ను బెదిరించారు.. చంపడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
ఎమ్మార్వో ఆఫీస్(MRO Office)కు వెళ్ళిన ప్పుడు నన్ను కొందరు వెంబడించారు. భయంతో అక్కడ నుంచి ఆటోలో పారిపోయాను. నేను ఆటో లో వెళ్తున్న విషయం గమనించి.. నన్ను ఫాలో చేశారని.. దీంతో తాను విజయవాడ(Vijayawada) పారిపోయాను.. అక్కడే తెలిసిన వాళ్ళ దగ్గర తలదాచుకున్నానని వివరించారు.
నాకు మైనంపల్లి నుంచి ప్రాణ హాని ఉందని.. నన్ను ఎంత బెదిరించినా.. నా స్థలం కబ్జా కానివ్వనని అన్నారు. మైనంపల్లి తనకు 8 సార్లు ఫోన్ చేశారని ఆరోపించారు. గతంలో ఎన్నో మార్లు తాను పోలీసులకు పిర్యాదు చేశానని.. అయినా కూడా పోలీసులు పట్టించుకోలేదని తిరుపతి రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. హైకోర్టు అడ్వకేట్ సలహా మేరకే డీసీపీ ఆఫీస్కు వచ్చామని తిరుపతి రెడ్డి వెల్లడించారు.
ఈ ఘటనపై అల్వాల్ సీఐ ఉపేందర్(Alwal CI Upender) మాట్లాడుతూ.. తిరుపతి రెడ్డి కిడ్నాప్ కాలేదని.. స్వతహాగా అతనే అజ్ఞాతంలోకి వెళ్ళాడని పేర్కొన్నారు. తిరుపతి రెడ్డి కిడ్నాప్ కట్టు కథ అల్లుతున్నాడని చెప్పారు. తిరుపతి రెడ్డి అల్వాల్ ఎమ్మార్వో ఆఫీస్(Alwal MRO Office) నుంచి ఆటోలో ఘట్ కేసర్(Ghatkesar) వెళ్ళాడని.. అక్కడి నుంచి జెల్లి కృష్ణ(Jelli Krishna) అనే స్నేహితుడుతో కలిసి కార్లో భువనగిరి(Bhuvanagiri) వెళ్ళాడని.. అక్కడ నుంచి విజయవాడ(Vijayawada) వెళ్లినట్లు వివరించారు. తిరుపతి రెడ్డి భార్య సుజాత(Sujatha) ఫిర్యాదు తర్వాత ఎమ్మార్వో ఆఫీస్ నుండి ఘట్ కేసర్ వరకు సీసీ ఫుటేజ్(CC TV Footage) సేకరించినట్లు వెల్లడించారు.
ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాల్ చేసినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదని అన్నారు. స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించిన తిరుపతి రెడ్డి కుటుంబ సభ్యులు, మద్దతుదారులపై కేసు నమోదు చేస్తామన్నారు. తప్పుడు ఫిర్యాదు చేసిన తిరుపతి రెడ్డిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.