ఎన్నికల వేళ కాబట్టి నాయకులెంత బిజీగా ఉంటారో వారి అనుచరులు అంతే హడావుడిగా ఉంటారు. నాయకుల మెప్పుకోసం చేయవలసిదంతా చేస్తుంటారు. తమ అభిమానాన్ని పలు రకాలుగా చాటుకుంటుంటారు. ఇట్టాగే మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ఓ బీజేపీ(BJP) కార్యకర్త అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. కొత్త చెర్వు తండా, మహ్మద్‌నగర్ గేటు తండాకు చెందిన సునావత్ సురేశ్‌నాయక్ పెళ్లి పత్రికపై(Wedding Invitation Card) బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందనరావు ఫోటోను ముద్రించారు.
ఎన్నికల వేళ కాబట్టి నాయకులెంత బిజీగా ఉంటారో వారి అనుచరులు అంతే హడావుడిగా ఉంటారు. నాయకుల మెప్పుకోసం చేయవలసిదంతా చేస్తుంటారు. తమ అభిమానాన్ని పలు రకాలుగా చాటుకుంటుంటారు. ఇట్టాగే మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ఓ బీజేపీ(BJP) కార్యకర్త అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. కొత్త చెర్వు తండా, మహ్మద్‌నగర్ గేటు తండాకు చెందిన సునావత్ సురేశ్‌నాయక్ పెళ్లి పత్రికపై(Wedding Invitation Card) బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందనరావు ఫోటోను ముద్రించారు. తన తమ్ముడి పెళ్లి పత్రికపై 'మా తమ్ముడి పెళ్లికి మీరు ఇచ్చే బహుమతి.. రఘునందనరావుకు మీరు వేసే ఓటు' అని రాయించారు. దాంతో పాటు రఘునందనరావు(Raghu nandhan Rao) ఫోటోను కూడా ప్రింట్ చేయించారు. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి చంద్రయ్య వెంటనే రియాక్టయ్యి విషయాన్ని కౌడిపల్లి మండలం ఎస్సై రంజిత్‌కుమార్‌రెడ్డికి చెప్పారు. ఆయన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎలాంటి అనుమతి లేకుండా ఎన్నికల సమయంలో ఎంపీ అభ్యర్థి ఫొటోతో పాటు ఓటు వేయాలని ముద్రించడం ఎన్నికల కోడ్(Election Code) ఉల్లంఘన కిందకే వస్తుందని రంజిత్‌కుమార్‌రెడ్డి తెలిపారు