మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలపడానికి ఏర్పాటు చేసిన శాసన సభ సమావేశంలో
మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలపడానికి ఏర్పాటు చేసిన శాసన సభ సమావేశంలో బీ.జే.పి. నేత, నిర్మల్ నియోజకవర్గ ఎమ్.ఎల్. ఏ. యేలేటి మహేశ్వర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. మన్మోహన్ సింగ్ ను రాహుల్ గాంధీ అవమానించారు అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ పైన ఏ మాత్రం ప్రేమ చూతుందో అర్థమవుతుంది అన్నారు.
ఒక సందర్భలో మన్మోహన్ సింగ్ గారు విడుదల చేసిన ఆర్డినెన్సును, రాహుల్ గాంధీ చింపివేశారని గుర్తు చేశారు. ఒక వైపు మన్మోహన్ మృతికి సంతాప దినాలు ప్రకటిస్తే.. రాహుల్ గాంధీ మాత్రం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వియత్నాం వెళ్ళడంటూ విమర్శించారు. మన్మోహన్ గారికి జరిగిన అవమానాలను గురించి కూడా గుర్తు చేసుకోవడంలో తప్పు లేదన్నారు.
10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని తెలుగువాడైన పి.వీ. నరసింహరావు గారికి భారత రత్న ఇవ్వలేకపోయిందని, బీ.జె.పి. అధికారంలోకి వచ్చాక మోదీ గారు ఆ పని చేశారని చెప్పారు. ఆ సమయంలో కూడా సోనియా గాంధీ ఫ్యామిలీ పి.వీ. మీద కోపంతో అవార్డు ప్రదనోత్సవానికి రాలేదని అన్నారు మహేశ్వర్ రెడ్డి. ఈ వ్యాఖ్యలతో సభలో కాంగ్రెస్ నేతలు సీరియస్ అయ్యారు. కేవలం సంతాపం తెలపవలసిందిగా మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.