తెలంగాణ‌ బీజేపీకి మ‌రో షాక్ త‌గిలింది. రామగుండం నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు కౌశిక్ హరి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.

తెలంగాణ‌(Telangana) బీజేపీ(BJP)కి మ‌రో షాక్ త‌గిలింది. రామగుండం(Ramagundam) నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు కౌశిక్ హరి(Kaushik Hari) త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ(BRS Party)లో చేరనున్నారు. ఈ మేర‌కు కౌశిక్ హరి రామగుండం ఎమ్మెల్యే కోరుగంటి చంద‌ర్‌(Koruganti Chandar)తో క‌లిసి ప్రగతి భవన్‌లో మంత్రులు కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao)లతో భేటీ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. 2009లో ప్రజా రాజ్యం(Prajarajyam) నుంచి పోటీ చేసిన కౌశిక్ హరి.. కేవలం 1200 ఓట్ల తేడాతో ఓడిపోయారు. త్వరలోనే రామగుండంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కౌశిక్ హరి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయ‌న‌తో స‌హా నియోజ‌క‌వ‌ర్గంలోని పలువురు బీజేపీ సీనియర్ నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.

Updated On 18 Aug 2023 11:02 PM GMT
Yagnik

Yagnik

Next Story