కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో హుజూరాబాద్ మండలం కనుకులగిద్దె సర్పంచ్ గోపు కొమురారెడ్డి మృతి చెందారు. కొమురారెడ్డి ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది.

BJP leader dies in road accident in Karimnagar
కరీంనగర్(Karimnagar) జిల్లా శంకరపట్నం(Shankarapatnam) మండలం కొత్తగట్టు(Kothagattu) సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో హుజూరాబాద్(Huzurabad) మండలం కనుకులగిద్దె సర్పంచ్(Kanukulagidde Sarpanch) గోపు కొమురారెడ్డి(Gopu Komura Reddy) మృతి చెందారు. కొమురారెడ్డి ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. కొమురారెడ్డి వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టినట్లు పోలీసులు(Police) అనుమానిస్తున్నారు. కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajendar)కు కొమురారెడ్డి అత్యంత సన్నిహితుడుగా పేరుంది. గతంలో హుజూరాబాద్ టీఆర్‌ఎస్(TRS) అధ్యక్షుడిగా, ఇతర పదవుల్లో కొమురారెడ్డి పనిచేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో రాజేందర్‌తో కలిసి కొమురారెడ్డి బీజేపీ(BJP)లో చేరారు.
