రాజకీయాల్లో ఇప్పుడు ఏమైనా జరగొచ్చని చెప్పడానికి ఎన్నో ఉదంతాలు కనిపిస్తాయి. అలాంటిది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly election) కామారెడ్డి బీజేపీ(BJP) అభ్యర్థి కాటిపల్లి రమణారెడ్డి గెలుపు(Katipalli Ramana Reddy) అందరినీ ఔరా అనిపించింది. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్టు ఏకంగా ఇద్దరు రాజకీయ ఉద్దండుల్ని ఎన్నికల్లో మట్టి కరిపించి.. వియఢంకా మోగించడం దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది.

రాజకీయాల్లో ఇప్పుడు ఏమైనా జరగొచ్చని చెప్పడానికి ఎన్నో ఉదంతాలు కనిపిస్తాయి. అలాంటిది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly election) కామారెడ్డి బీజేపీ(BJP) అభ్యర్థి కాటిపల్లి రమణారెడ్డి గెలుపు(Katipalli Ramana Reddy) అందరినీ ఔరా అనిపించింది. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్టు ఏకంగా ఇద్దరు రాజకీయ ఉద్దండుల్ని ఎన్నికల్లో మట్టి కరిపించి.. వియఢంకా మోగించడం దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. అందులో ఒకరు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉండగా..మరొకరు ప్రస్తుతం సీఎం రేసులో ఉన్న అభ్యర్థి. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి నువ్వా-నేనా అన్నట్టు..ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ట్రయాంగిల్ ఫైట్‎లో కమలం అభ్యర్థి గెలుపొందడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత.. ఎవరి నోటా విన్నా వినిపంచే పేరు వెంకటరమణారెడ్డి(venkata Ramana Reddy). కామారెడ్డి(Kama reddy) ఎన్నికల బరిలో దిగిన అధికార, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షులు, కేసీఆర్(KCR), రేవంత్‎రెడ్డిలను(Revanth Reddy) వెనక్కి నెట్టి..విజయం సాధించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి చరిత్ర సృష్టించారు. ఇద్దరు రాజకీయ ఉద్దండులను ఓడించడం అంత ఆషామాషీ కాదు. తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ సీఎం కేసీఆర్‌పై 6,741 ఓట్ల ఆధిక్యంతో గెలిచి దేశప్రజలందరి దృష్టిని ఆకర్షించి జెయింట్‌ కిల్లర్‌గా నిలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కామారెడ్డి అభ్యర్థి రేవంత్‌రెడ్డి మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజయం వెనుకున్న కారణాలు ఏంటి? ఇంతకీ ఎవరీ వెంకటరమణారెడ్డి.

కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన కాటిపల్లి వెంకటరమణారెడ్డి వృత్తిరీత్యా వ్యాపారవేత్త. వెంకటరమణారెడ్డి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌ పార్టీతోనే మొదలైంది. 2004లో నిజామాబాద్ జిల్లాలోని మండల పరిషత్ ప్రాదేశిక మండలి సభ్యునిగా చేశారు. ఆ తర్వాత జిల్లా పరిషత్ ప్రాంతీయ మండలి సభ్యునిగా, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా సేవలందించారు. మాజీ దివంగత సీఎం వైఎస్ మరణం తర్వాత, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కేవీఆర్ బీఆర్ఎస్‎కి మద్దతు ఇచ్చారు. దీంతో 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రమణారెడ్డి బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా తర్వాత జరిగిన పంచాయతీ, పురపాలక సంఘం ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులతో కలిసి ఉద్యమించారు. చివరికి దాన్ని రద్దు చేయించారు. ధరణి పోర్టల్‌లో సమస్యలు పరిష్కరించాలని, మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ రాయితీ నిధులు మంజూరుచేయాలని పోరాటాలు చేశారు. ఏడాది కాలంగా నియోజకవర్గమంతా కులసంఘాల భవనాలను, దేవాలయాలను సొంత నిధులతో నిర్మిస్తున్నారు. అన్నివర్గాల ప్రజల ఆమోదం పొంది.. ప్రస్తుత ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు.

Updated On 4 Dec 2023 6:59 AM GMT
Ehatv

Ehatv

Next Story