లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections)కు ఇంచుమించు ఏడాది సమయం ఉంది. ఆ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న చర్చ మొదలయ్యింది. సార్వత్రిక ఎన్నికలకు సుమారు ఆరు నెలల ముందు అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ప్రీ ఫైనల్‌గా భావిస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి విపక్షాల ఆత్మవిశ్వాసాన్ని నీరుగార్చాలన్నది కమలం పార్టీ ఆలోచన. అందుకే ఇప్పట్నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు బీజేపీ పెద్దలు.

లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections)కు ఇంచుమించు ఏడాది సమయం ఉంది. ఆ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న చర్చ మొదలయ్యింది. సార్వత్రిక ఎన్నికలకు సుమారు ఆరు నెలల ముందు అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ప్రీ ఫైనల్‌గా భావిస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి విపక్షాల ఆత్మవిశ్వాసాన్ని నీరుగార్చాలన్నది కమలం పార్టీ ఆలోచన. అందుకే ఇప్పట్నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు బీజేపీ పెద్దలు. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది బీజేపీ. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ పదే పదే చర్చలు జరుపుతున్నది ఇందుకోసమే! కొత్తగా నిర్మించిన రెసిడెన్షియల్ భవనంలో సోమవారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిపిన ఈ త్రయం మంగళవారం ఉదయం కూడా సుమారు పది గంటల పాటు కీలక చర్చలు జరిపారు. ఎన్నికలు జరగబోతున్న అయిదు రాష్ట్రాలలో బలబలాలపై చర్చించారు. బలహీనతలను అధిగమించడానికి ఏం చేయాలన్నదానిపై మేథోమధనం జరిపారు. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు ఉంటే, రాజస్థాన్‌లో 25 సీట్లు, మధ్యప్రదేశ్‌లో 29 సీట్లు, చత్తీస్‌గఢ్‌లో 11 స్థానాలు ఉన్నాయి. అంటే ఎన్నికలు జరగబోతున్న అయిదు రాష్ట్రాలలో 82 లోక్‌సభ స్థానాలు ఉన్నాయన్నమాట. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించగలిగితే ఆ గెలుపు లోక్‌సభ ఎన్నికలకు టానిక్‌లా పని చేస్తుందన్నది బీజేపీ భావన. అందుకే ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు కమలం పార్టీ అగ్ర నేతలు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలలో పార్టీ అధ్యక్షులను, ఇన్‌ఛార్జ్‌లను కూడా మార్చాలని డిసైడయ్యారట! తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మల్చుకోవడం ఎలా అన్నదానిపై నేతలు సుదీర్ఘంగ చర్చలు జరిపారు. టీఆర్‌ఎస్‌లోని అసమ్మతి నేతలను తమవైపుకు తిప్పుకోవడం ఎలా అన్నదానిపై కసరత్తలు చేశారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న అసంతృప్త నేతలను కూడా అక్కున చేర్చుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. వీటితో పాటు కొత్తగా ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీ, మేనిఫెస్టో కమిటీ నియామకాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నారు. పార్టీ అధ్యక్ష పదవిని కోరుకుంటున్న ఈటల రాజేందర్‌కు ముఖ్యమైన బాధ్యతను అప్పగించాలనుకుంటున్నారట. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై గుర్రుగా ఉన్న నేతలను పిలిచి మాట్లాడి, వారికి నచ్చచెప్పాలనుకుంటోంది అధిష్టానం. కలిసికట్టుగా ఎన్నికలకు వెళితేనే గెలుపు సాధ్యమవుతుందని హితబోధ చేయనుంది. ఇక ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడంపై కూడా చర్చించారు. తెలంగాణలో అది కుదిరే పని కాదు కానీ, మిగతా రాష్ట్రాలలో కాంగ్రెసేతర పార్టీలతో జత కట్టాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. కుదిరితే తెలంగాణలో కూడా టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారు.

Updated On 7 Jun 2023 1:50 AM GMT
Ehatv

Ehatv

Next Story