బీజేపీ ఎల్పీ(BJP LP) నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(Eleti maheshwar reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ఎల్పీ(BJP LP) నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(Eleti maheshwar reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. 2025 జూన్ లేదా డిసెంబర్‌లో తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి(Telangana) వస్తారని ఆయన అన్నారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి(Uttam kumar reddy) , బట్టి విక్రమార్క(Bhati vikramarka) , కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komati reddy) , పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలలో(Ponguleti srinivas) ఎవరో ఒకరు ముఖ్య మంత్రి(Chief Minister) అవుతారని మహేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతులు పండించిన వడ్లు, పత్తిని కొనుగోలు చేయడంలేదన్నారు. ఢిల్లీలో కప్పం కట్టేందుకు రైతులను ముంచుతున్నారు. ఈ ప్రభుత్వానికి కొంచెం కూడా సిగ్గుందా అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లలో రకరకాల నిబంధనలు పెడుతున్నారు. సివిల్ సప్లైలో అవినీతి జరుగుతుందని బీజేపీ చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని మహేశ్వర్‌రెడ్డి అన్నారు. వచ్చే జూన్ నుంచి డిసెంబర్ లోపు తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి వస్తాడని.. ఏడు నెలల నుంచి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. కేరళ వెళ్లినా కూడా రేవంత్ రెడ్డికి(Revant reddy) ప్రియాంక గాంధీ(Priyanka gandhi) అపాయింట్మెంట్ ఇవ్వలేదు.. దూరం నుంచి చూసి వచ్చాడు, మూసీ ప్రాజెక్టు వ్యయంను మూడు రెట్లు పెంచిన తరువాత అవినీతి ఉందని బయట పడిందని.. అందుకోసమే ప్రక్షాళన చేపట్టారన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష ధోరణిని సీనియర్ మంత్రులు ఒప్పుకోవడం లేదన్నారు మహేశ్వర్‌రెడ్డి, తాను రీసెర్చ్ చేస్తేనే మాట్లాడుతా తప్ప ఊరికే మాట్లాడనన్నారు.