పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament Elections) పొత్తులు ఉండవని బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‎రెడ్డి(Kishan Reddy) తేల్చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ కార్యాలయంలో శుక్రవారం కిషన్‎రెడ్డి అధ్యక్షతన పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ ప్రబారీలతో భేటీ జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన కిషన్‎రెడ్డి.. లోక్‎సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.

తెలంగాణలో(Telangana) ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించింది. గతంతో పోలిస్తే ఓట్లు, సీట్లను పెంచుకుంది. పలుచోట్ల బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్ పార్టీ(Congress) అభ్యర్థులకు గట్టి పోటీని ఇచ్చింది. ఈ నేపథ్యంలో లోక్‎సభ ఎన్నికలే టార్గెట్ గా రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే హైదరాబాద్‎లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దీనికి పార్టీ ముఖ్యనేతలు, జిల్లా అధ్యక్షులు, ఇంచార్జ్‎లు, పార్లమెంట్ ప్రబారీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పొత్తులపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‎రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని తేల్చేశారు ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్‎రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో(Janasena) పొత్తు పెట్టుకుని..9 సీట్లు ఆ పార్టీకి కేటాయించింది. అయితే కనీసం ఒక్కచోట కూడా జనసేనకు డిపాజిట్ దక్కలేదు. దీంతో ఈసారి ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. బీజేపీ-బీఆర్ఎస్ పొత్తు కేవలం ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ సహా..పార్టీ అగ్రనేతలు చేసిన ప్రచారానికి మెరుగైన ఫలితాలే వచ్చాయి. కానీ..తాము ఆశించిన ఫలితాలు రాలేదన్న నిరాశ ఆ పార్టీలో ఉంది. దీంతో ముందుగానే మేల్కొన్న బీజేపీ పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ నేతలు, క్యాడర్‌కు కిషన్‎రెడ్డి పిలుపునిచ్చారు. సర్వే సంస్థలకు కూడా అందని విధంగా లోకసభ ఫలితాలుంటాయన్నారు. రేపటి నుంచి తెలంగాణలో మొదలుకానున్న వికసిత్ భారత్ కార్యక్రమంలో..కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నేతలు, కేడర్‎కు సూచించారు. కొత్తగా ఎన్నికైన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉమ్మడి జిల్లాలో పర్యటించి..విస్తృత ప్రచారం చేస్తారని కిషన్‎రెడ్డి ప్రకటించారు. డిసెంబర్ చివరి వారంలో తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నట్లు చెప్పారు. తెలంగాణలో మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

Updated On 15 Dec 2023 4:40 AM GMT
Ehatv

Ehatv

Next Story