పల్లె పల్లెకు బిజెపి గడప గడపకు మోహన్ రావు కార్యక్రమం సందర్బంగా నేడు కుబీర్(Kubir) మండలంలోని న్యూ సౌన్లీ(New Sounly), వాయి గ్రామాలలో పర్యటించి బిజెపి(BJP) పార్టీ జెండాలను ఆవిష్కరించిన రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు, ముధోల్ నియోజకవర్గం బిజెపి నాయకులు బోస్లే మోహన్ రావు పాటిల్(Bhosle Mohan Rao Patil). .

Bhosle Mohan Rao Patil
పల్లె పల్లెకు బిజెపి గడప గడపకు మోహన్ రావు కార్యక్రమం సందర్బంగా నేడు కుబీర్(Kubir) మండలంలోని న్యూ సౌన్లీ(New Sounly), వాయి గ్రామాలలో పర్యటించి బిజెపి(BJP) పార్టీ జెండాలను ఆవిష్కరించిన రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు, ముధోల్ నియోజకవర్గం బిజెపి నాయకులు బోస్లే మోహన్ రావు పాటిల్(Bhosle Mohan Rao Patil). . అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ బిఆర్ఎస్(BRS), కాంగ్రెస్(congress) నాయకుల గారడీ మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. తెలంగాణలో ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాల వారి అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని అన్నారు. ఇప్పటికే ముధోల్ లోని ప్రతీ మండలంలోనూ పల్లె పల్లెకు బిజెపి గడప గడపకు మోహన్ రావు కార్యక్రమం జయప్రదంగా నిర్వహించిన మోహన్ రావుకి ఆశేష ప్రజా మద్దత్తు లభించింది. ప్రస్తుత శాసన సభ్యుడు విట్టల్ రెడ్డి సంక్షేమ పథకాలన్నీ కేవలం వారి వర్గానికే అందిస్తున్నారని, నిజమైన లబ్ధిదారులకు అందట్లేదనే ఫిర్యాదులు ఎక్కువగా తన పాదయాత్ర లో వస్తున్నాయని మోహన్ రావు పాటిల్ అన్నారు.
