తీవ్రవాదులను తయారు చేస్తూ బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడుతున్న తబ్లిక్ జమాతే సంస్థ కు(Tablik Jamaat organization) నిధులిస్తున్న ప్రభుత్వం 41 రోజుల కఠోర దీక్ష చేసే అయ్యప్ప స్వాములకు(Ayyappa Swamy) సౌకర్యాలు కల్పించేందుకు నిధులెందుకు కేటాయించడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) ప్రశ్నించారు. శబరిమలలో(Shabarimala) గత కొద్దిరోజులుగా అయ్యప్ప స్వాములు పడుతున్న బాధలు మీ కళ్లకు కన్పించడం లేదా?

Bandi Sanjay
తీవ్రవాదులను తయారు చేస్తూ బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడుతున్న తబ్లిక్ జమాతే సంస్థ కు(Tablik Jamaat organization) నిధులిస్తున్న ప్రభుత్వం 41 రోజుల కఠోర దీక్ష చేసే అయ్యప్ప స్వాములకు(Ayyappa Swamy) సౌకర్యాలు కల్పించేందుకు నిధులెందుకు కేటాయించడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) ప్రశ్నించారు. శబరిమలలో(Shabarimala) గత కొద్దిరోజులుగా అయ్యప్ప స్వాములు పడుతున్న బాధలు మీ కళ్లకు కన్పించడం లేదా? అక్కడ తాగడానికి నీళ్లు లేవు. తినడానికి తిండి లేదు. చలిలో గంటల తరబడి నిలబడి అరిగోస పడుతున్న దారుణ దృశ్యాలు మీడియా, సోషల్ మీడియాలో వస్తున్నాయి. చిన్న పిల్లోడిని కదిలించినా ఆ స్వాముల కష్టాలు చెబుతారు. పాలకులకు కనబడకపోవడం సిగ్గు చేటని సంజయ్ అన్నారు.
ప్లాన్ ప్రకారం కుట్ర చేస్తున్నారు. హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారు. ఎక్కువ మంది దర్శించుకునే ధార్మిక ప్రదేశాల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ , సరైన సౌకర్యాలు(Facilities) కల్పించకుండా చేయడంవల్ల భక్తులు రాకుండా చేయాలనే కుట్ర చేస్తున్నారు. తిరుమలలో కూడా పులులు వస్తున్నాయనే భయంతో భక్తులు రాకుండా చేస్తూ హిందూ సనాతన ధర్మాన్ని దెబ్బతీసేలా కుట్ర జరుగుతోంది. హిందూ సమాజమంతా ఆలోచించాలని కోరుతున్నా. మసీదులో పనిచేసే ఇమాంలకు, చర్చిల్లో పనిచేసే ఫాస్టర్లకు జీతాలిస్తున్న ప్రభుత్వం ఆలయ పూజారులకు, గురుద్వారాలో పనిచేసే గురువులకు జీతాలెందుకు ఇవ్వడం లేదో ఆలోచించాలి. ఒక వర్గం ఓట్ల కోసం హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల స్వార్ధ రాజకీయాలకు తగిన బుద్ది చెప్పాలని బండి సంజయ్ కోరారు.
