ఆందోలు నియోజకవర్గం(Andolu Constituency) బీజేపీ(BJP) టికెట్టు ఎవరికి దక్కబోతున్నది? అక్కడ్నుంచి పోటీ చేయడానికి మాజీ మంత్రి బాబూమోహన్‌(Babu Mohan) సిద్ధంగా ఉన్నాక కూడా ఈ సందేహం ఎందుకొచ్చిందంటారా? సడన్‌గా బాబుమోహన్‌ కుమారుడు ఉదయ్‌ బాబూమోహన్‌(Uday babu mohan) సీన్‌లోకి వచ్చేసరికి ఆ డౌట్‌ వచ్చింది.

ఆందోలు నియోజకవర్గం(Andole constituency) బీజేపీ(BJP) టికెట్టు ఎవరికి దక్కబోతున్నది? అక్కడ్నుంచి పోటీ చేయడానికి మాజీ మంత్రి బాబూమోహన్‌(Babu Mohan) సిద్ధంగా ఉన్నాక కూడా ఈ సందేహం ఎందుకొచ్చిందంటారా? సడన్‌గా బాబుమోహన్‌ కుమారుడు ఉదయ్‌ బాబూమోహన్‌(Uday babu mohan) సీన్‌లోకి వచ్చేసరికి ఆ డౌట్‌ వచ్చింది. బీజేపీ టికెట్‌ కోసం తండ్రీకొడుకులు పోటీపడుతుండటం ఆసక్తికరంగా మారింది. 1998లో ఆందోల్‌ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో(By Elections) తెలుగుదేశం పార్టీ(TDP) తరఫున బరిలోకి దిగిన సినీ నటుడు బాబూమోహన్‌ విజయం సాధించారు. తర్వాత 1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ గెలుపొందారు.

మంత్రిగా కూడా పని చేశారు. 2004, 2009 ఎన్నికలలో మాత్రం దామోదర్‌ రాజనర్సింహ(Damodar Rajanarsimha) చేతిలో ఓటమి పాలయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీపీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో(BRS) చేరారు బాబూమోహన్‌. ఆందోల్‌ టికెట్‌ తెచ్చుకున్నారు. మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు. నాలుగున్నరేళ్లు ఆ పదవిలో ఉన్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బాబూమోహన్‌కు బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇవ్వలేదు. వెంటనే భారతీయ జనతాపార్టీలో చేరారు. బీజేపీ తరఫున బరిలో దిగారు. మూడో స్థానంలో నిలిచారు. ఇక వర్తమానానికి వస్తే ఇప్పుడు బీజేపీ ప్రకటించిన 52 మంది అభ్యర్థుల జాబితాలో బాబూమోహన్‌ పేరు లేదు.

ఆయన కుమారుడు ఉదయ్‌ బాబూమోహన్‌ పేరును బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్నదని, అందుకే ఫస్ట్‌ లిస్ట్‌లో బాబూమోహన్‌ పేరు లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆందోల్‌లో ఉదయ్‌బాబూ మోహన్‌ను బరిలో దింపే ప్రయత్నంలో బీజేపీ ఉందని కొన్ని మీడియాలలో వచ్చింది. ఇప్పుడు నియోజకవర్గంలో ఇదే టాపిక్‌గా మారింది. రెండు నెలల కిందట పార్టీ సీనియర్‌ నాయకుడు జితేందర్‌రెడ్డి అందోలు టికెట్‌ను ఉదయ్‌బాబుకు ఇద్దామని బాబూమోహన్‌తో అన్నట్లు పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు.

అప్పటి నుంచి ఉదయ్‌బాబును నియోజకవర్గానికి దూరంగా ఉంచేందుకు బాబూమోహన్‌ ప్రయత్నిస్తున్నారట! ఆందోలు బీజేపీ టికెట్‌ కోసం మాజీ జెడ్పీ ఛైర్మన్‌ బాలయ్య(Balayya) కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆందోల్‌ టికెట్ తన కొడుకుకు కాకుండా తనకే ఇవ్వాలని బీజేపీ అధిష్టానవర్గంపై బాబూమోహన్‌ ఒత్తిడి తీసుకొస్తున్నారట! ఆందోల్‌ టికెట్ కోసం తండ్రీకొడుకుల మధ్య గొడవలు వచ్చే ప్రమాదం లేకపోలేదు

Updated On 26 Oct 2023 3:11 AM GMT
Ehatv

Ehatv

Next Story