బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha)కు సుప్రీంకోర్టు(Supreme Court) బెయిల్ మంజూరు చేసింది. కవితకు బెయిల్‌ రావడమే ఆలస్యం కాంగ్రెస్‌(Congress),బీజేపీ(BJP)లు మళ్లీ వాదులాడుకోవడం మొదలుపెట్టాయి.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha)కు సుప్రీంకోర్టు(Supreme Court) బెయిల్ మంజూరు చేసింది. కవితకు బెయిల్‌ రావడమే ఆలస్యం కాంగ్రెస్‌(Congress),బీజేపీ(BJP)లు మళ్లీ వాదులాడుకోవడం మొదలుపెట్టాయి. మళ్లీ అరిగిపోయిన గ్రామఫోన్‌ రికార్డును తిప్పడం మొదలు పెట్టాయి. కవితకు బెయిల్ ఊహించిందేనని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ(Congress MLC), టీపీసీసీ(TPCC)వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ (Mahesh Kumar Goud)చెప్పారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌(BRS) కుమ్మక్కుతోనే బెయిల్‌ వచ్చిందని ఈ కాలజ్ఞాని చెప్పుకొచ్చారు. మొన్నటి వరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్‌ను దెబ్బ తీయాలని చూశారట! బీజేపీకి బీఆర్‌ఎస్‌ దాసోహమయ్యిందట! రేపో మాపో బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనమవుతుందట! బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగి కాళ్ల మీద పడి కవితకు బెయిల్‌ తెచ్చుకున్నారట! ఈయన ఇలా అంటున్నారా? బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ మరోలా అంటున్నారు. కవితకు బెయిల్‌ రావడానికి కాంగ్రెస్‌ పార్టీ చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలించాయని బండి సంజయ్‌(Bandi Sanjay)ఎక్స్‌లో తన అభిప్రాయాన్ని చెప్పారు. కవితకు బెయిల్‌ రావడం కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల సమిష్టి విజయమన్నారు. కాంగ్రెస్‌ లాయర్ల కృషితోనే కవితకు బెయిల్ వచ్చిందని.. కవితను బయటికి తీసుకొచ్చేందుకు కృషిచేసిన.. అభిషేక్‌ మను సింఘ్వీని రాజ్యసభ సభ్యునిగా ఎన్నుకునేందుకు కేసీఆర్‌ మద్దతు ఇచ్చారని బండి సంజయ్‌ చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పటి నుంచి జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్‌లు బీఆర్‌ఎస్‌పైన పడ్డాయి. బీఆర్‌ఎస్‌ కనుమరుగు కావాలన్నది రెండు జాతీయ పార్టీల అభిమతం. రేప్పొద్దున ఆ పార్టీ మళ్లీ పుంజుకోవచ్చన్న భయం ఆ పార్టీలకు ఉంది. అందుకే బీఆర్‌ఎస్‌ పతనాన్ని రెండు పార్టీలు కోరుకుంటున్నాయి. బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనమవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి దగ్గర్నుంచి మొదలుపెడితే కాంగ్రెస్‌లో ఉన్న ప్రతి ఒక్కరు చెబుతున్నారు. సేమ్‌ టైమ్‌ బీజేపీ నుంచి కూడా ఇదే మాటవినిపిస్తోంది. కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌లు ఒక్కటేనని, రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తుంటాయని బీజేపీ ఆరోపిస్తుంటుంది. ఇంత చిత్రమైన పరిస్థితి మరే రాష్ట్రంలోనూ ఉండదేమో! ఈ విషయంలో తెలంగాణ ప్రజలకు మాత్రం క్లారిటీ ఉంది.

ehatv

ehatv

Next Story