రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌, బీజేపీ పొత్తు ఉంటుందనే ప్రచారం చేశారు

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌, బీజేపీ పొత్తు ఉంటుందనే ప్రచారం చేశారు. దీనిపై ఇప్పటి వరకూ ఇరుపార్టీల నుండి ఎవరూ స్పందించలేదు. ఈ వార్తలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ స్పందించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీకి ఎలాంటి పొత్తులు ఉండవని తేల్చి చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కాళ్ల బేరానికి వచ్చినా ఆ పార్టీతో పొత్తు ఉండదని.. ఈ విషయాన్ని తాను పార్లమెంటరీ బోర్డు సభ్యుని హోదాలో చెబుతున్నానన్నారు. రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ సీట్లలోనూ బీజేపీ పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ మునిగిపోయే నావ అని, బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని లక్ష్మణ్‌ తెలిపారు. బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ రహస్య ఒప్పందం చేసుకున్నాయన్నాయన్నారు. ఆంధ్రలో పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

ఇక రెండు రోజుల క్రితం బీఆర్ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి, టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తోందని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పార్టీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. తెలంగాణను నిలువునా దోచుకున్న బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ప్రసక్తే లేదని అన్నారు. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ బరిలోకి దిగుతోందని స్పష్టం చేశారు.

Updated On 19 Feb 2024 2:19 AM GMT
Yagnik

Yagnik

Next Story