హైదరాబాద్‌లో ఓ బైకర్(Bike) రెచ్చిపోయాడు.
హైదరాబాద్‌లో ఓ బైకర్(Bike) రెచ్చిపోయాడు. 65 ఏళ్ల వృద్ధుడి(Oldman) ప్రాణాలను పొట్టనపెట్టుకున్నాడు. స్లోగా వెళ్లాలని సూచించినందుకు ఓ బైకర్ వృద్ధుడిపై దాడి చేశాడు. దీంతో వృద్ధుడు కిందపడిపోయి ఆస్పత్రి పాలయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లోని అల్వాల్‌లో ఆంజనేయులు (65) అనే వృద్ధుడు రోడ్డు దాటుతుండగా ఓ వ్యక్తి బైక్‌పై వేగంగా వచ్చాడు. బైక్‌పై వేగంగా, నిర్లక్ష్యంగా వెళ్తుండగా నెమ్మదిగా నడపాలని వృద్ధుడు సలహా ఇచ్చాడు. పెద్దమనిషి కదా అని యువకుడు ఊరుకోలేదు. కోపోద్రిక్తుడైన ఆ యువకుడు వృద్ధుడిపై దాడికి పాల్పడ్డాడు. వృద్ధుడిపై దాడి చేయడం, అతను నేలపై పడిపోవడం, తలకు బలమైన గాయం కావడం సీసీ ఫుటేజీలో కనిపించింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ వృద్ధుడు కన్నుమూశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మోటర్ బైక్ నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటన సెప్టెంబర్ 30న జరిగింది. కానీ అక్టోబర్ 17, గురువారం సోషల్ మీడియాలో ఇవి వైరలయ్యాయి.