భార్యను ముక్కలు చేసిన ఘటనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గురుమూర్తికి మరో మహిళతో ఎఫైర్ ఉన్నట్లు తెలుస్తోంది.
భార్యను ముక్కలు చేసిన ఘటనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గురుమూర్తికి మరో మహిళతో ఎఫైర్ ఉన్నట్లు తెలుస్తోంది. అతని ఫోన్‌లో మరో మహిళ ఫోటోలను గుర్తించిన పోలీసులు. భార్యను వదిలించుకునేందుకే హత్యచేసి ఉంటాడని అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నెల 15న గురుమూర్తి , వెంకటమాధవి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భార్య పై అనుమానం తో హత్య చేసిన సంఘటన రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి(EX- ఆర్మీ) వృత్తి రీత్యా డీఆర్‌డీవో (DRDO)లో ఔట్‌సోర్సింగ్ సెక్యూరిటీ వృత్తి నిర్వహిస్తూ జిల్లెల్లగూడ లోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో భార్య వెంకట మాధవి(35) తో నివాసముంటున్నారు వీరికి ఇద్దరు పిల్లలు. ఈనెల 13న మిస్సింగ్ అయినట్టు మీరు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు మృతురాలి తల్లిదండ్రులు. ఫిర్యాదు చేస్తున్న సమయం లో తనకు ఏం తెలియదు అన్నట్టుగా అత్తమామలతో కలిసి మీర్‌పేట పిఎస్‌కు వచ్చిన మృతురాలి భర్త. తన భార్యను చంపడానికి ముందు కుక్కను చంపి తర్వాత భార్యను హతమార్చినట్లు సమాచారం. అతికిరాతకంగా భార్యను భర్త గురుమూర్తి హత్య చేశాడు, ఆ తర్వాత డెడ్ బాడీని ముక్కలు, ముక్కులుగా కుక్కర్‌లో ఉడక పెట్టిన కసాయి భర్త. భార్యపై అనుమానంతో ఈ ఘాతుకానికి గురుమూర్తి ఒడిగట్టాడు. ఆ తర్వాత శవం ముక్కలను మీర్‌పేట చెరువులో వేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.