సంచలనం సృష్టించిన మీర్‌పేట వెంకట మాధవి హత్య కేసులో విచారణ ముమ్మరం చేశారు పోలీసులు.

సంచలనం సృష్టించిన మీర్‌పేట వెంకట మాధవి హత్య కేసులో విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. విచారణలో తవ్వేకొద్ది నిజాలు బయటపడుతున్నాయి. ఈ మధ్యకాలంలో విడుదలైన మలయాళ హిట్ మూవీ సూక్ష్మదర్శిని స్ఫూర్తిగా తీసుకొని గురుమూర్తి తన భార్య మృతదేహాన్ని మాయం చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసు దాదాపుగా ఓ కొలిక్కి రావడంతో నిందితుడిపై పోలీసులు చర్యలకు దిగనున్నారు. సూక్ష్మదర్శిని సినిమా తరహాలోనే మృతదేహాన్ని డిస్పోస్ చేశాడు ఆ చిత్రంలో చూపించిన విధంగా భార్య మాధవి మృతదేహాన్ని కెమికల్స్‌లో నానబెట్టి, ఆపై కాల్చి పొడి చేశాడు గురుమూర్తి. ఇవాళ డీఎన్‌ఏ రిపోర్ట్‌తో పాటు క్లూస్‌టీం ఆధారంగా ఇచ్చే నివేదిక వచ్చే అవకాశం ఉంది. దీంతో.. సాయంత్రంలోగా నిందితుడపై యాక్షన్‌కు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. మలయాళం థ్రిల్లర్ మూవీ సూక్ష్మదర్శిని సినిమాలో మహిళ హత్య, బాడీ డిస్పోస్ చేసేందుకు వాడిన కెమికల్స్ చూపించారు. సాధారణంగా పక్కింట్లో ఏం జరుగుతుందోనన్న కుతూహలంతో ఆ ఇంట్లో జరిగిన దారుణహత్యను ఓ మహిళ ఎలా బయటపెట్టిందనేది ఈ చిత్రం సారాంశం. అయితే ఇదే సినిమా ఇప్పుడు నిజమైన హత్యలకు స్ఫూర్తినివ్వడం గమనార్హం
