తెలంగాణ(Telangana)లో బీజేపీ(BJP)కి బిగ్ షాక్ తగిలింది. బీజేపీకి రాజీనామా చేసిన వివేక్(Vivek Venkatswamy).. రాహుల్(Rahul Gandhi) సమక్షంలో కాంగ్రెస్(Congress)లో చేరిపోయారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(Kishan Reddy)కి పంపించారు. తెలంగాణ పర్యటనలోనే ఉన్న రాహుల్‌ను నోవాటెల్‌లో కలిసి తన కొడుకు వంశీతో సహా కాంగ్రెస్‌లో చేరారు.

బీజేపీలో కొనసాగుతానని వివేక్ చెప్పినా.. కొంత కాలంగా పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతోంది. వివేక్‌కు మేనిఫెస్టో కమిటీ బాధ్యతలు అప్పగించినా ఆయన పార్టీని వీడడం గమనార్హం. కేసీఆర్‌ను కొట్టాలంటే బీజేపీతో సాధ్యం కాదని, తనకు టికెట్ ముఖ్యం కాదని, కేసీఆర్‌ను గద్దె దించడమే తన లక్ష్యమని వివేక్ చెప్పుకొచ్చారు.
బీజేపీకి రాజీనామా చేసిన కొద్దిగొంటల్లోనే వివేక్ కాంగ్రెస్‌లో చేరారు. వివేక్ కాంగ్రెస్‌లోకి తిరిగి రావడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. తన కొడుకు భవిష్యత్ కోసమే కాంగ్రెస్‌లో చేరారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నరు. గత కొంత కాలంగా వివేక్ కొడుకు వంశీ రాజకీయాలపై పోస్టులు పెడుతూ తాను రాజకీయాల్లోకి రాబోతున్నానని సంకేతాలిస్తూ వచ్చాడు. గడ్డం వంశీ 22 ఏళ్లకే విశాఖ ఇండస్ట్రీస్ జేఎండీగా బాధ్యతలు చేపట్టాడు. సొంత యూట్యూబ్ చానెల్‌తో పలువురు ప్రముఖులను కూడా ఇంటర్వ్యూలు చేశారు. మణిపూర్ అల్లర్ల సమయంలో సోషల్ మీడియాలో మోడీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి డిలీట్ చేయడం చర్చనీయాంశమైంది.తాత గడ్డం వెంకటస్వామి బాటలోనే కాంగ్రెస్‌లోకి వెళ్దామని, వివేక్‌పై కొడుకు వంశీ ఒత్తిడి తెచ్చాడని.. కొడుకు బలవంతంతోనే పార్టీ మారేందుకు వివేక్ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.