మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి కేసు(YS Viveka Case)లో కడప లోక్‌సభ సభ్యుడు అవినాశ్‌రెడ్డి(YS Avinash Reddy)కి ఊరట లభించింది. కేసులో ప్రధాన నిందితుడు దస్తగిరి(Dastagiri) వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు(Telangana High Court) కొట్టేసింది.
మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి కేసు(YS Viveka Case)లో కడప లోక్‌సభ సభ్యుడు అవినాశ్‌రెడ్డి(YS Avinash Reddy)కి ఊరట లభించింది. కేసులో ప్రధాన నిందితుడు దస్తగిరి(Dastagiri) వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు(Telangana High Court) కొట్టేసింది. వివేకా హత్య కేసులో సాక్ష్యులను అవినాశ్‌రెడ్డి ప్రభావితం చేస్తున్నారని, కాబట్టి ఆయనకు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ దస్తగిరి ఓ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే దస్తగిరి వాదనను అవినాశ్ రెడ్డి తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు. చివరకు అవినాశ్ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. పిటిషన్‌ను కొట్టేసింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన అవినాశ్‌రెడ్డి తండ్రి వై.ఎస్.భాస్కర్‌రెడ్డికి ఊరట లభించింది. భాస్కర్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఇదే సమయంలో ఉదయ్‌కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్ లకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.