☰
✕
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్‌లో సంతకం చేయాలన్న నిబంధనను మినహాయిస్తూ తీర్పు వెల్లడించిన నాంపల్లి కోర్టు.
x
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్‌లో సంతకం చేయాలన్న నిబంధనను మినహాయిస్తూ తీర్పు వెల్లడించిన నాంపల్లి కోర్టు. అలాగే విదేశాలకు అల్లు అర్జున్(Allu Arjun) వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట సంతకం చేయాలని గతంలో కోర్టు షరతు విధించింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని అల్లు అర్జున్ కోరారు. దీనికి నాంపల్లి కోర్టు(Nampally court) అంగీకారం తెలిపింది. మరోవైపు అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లేందుకు కూడా న్యాయస్థానం అనుమతించింది. కాగా.. సంథ్య థియేటర్ తొక్కిసలాట(Sandhya Theatre Stampede) కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
ehatv
Next Story