నేటి సమాజంలో బంధాలు, అనుబంధాలకు చోటు లేకుండా పోయింది. పెళ్లయ్యి ఇద్దరు, ఇద్దరు పిల్లలున్నా వివాహేతరం సంబంధాలు పెట్టుకుని తమ కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. వివాహిత మహిళ, ప్రియుడు ఒకటి కోసం ఘాతుకానికి పాల్పడ్డారు. హత్యలు చేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించారు.

నేటి సమాజంలో బంధాలు, అనుబంధాలకు చోటు లేకుండా పోయింది. పెళ్లయ్యి ఇద్దరు, ఇద్దరు పిల్లలున్నా వివాహేతరం సంబంధాలు పెట్టుకుని తమ కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. వివాహిత మహిళ, ప్రియుడు ఒకటి కోసం ఘాతుకానికి పాల్పడ్డారు. హత్యలు చేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించారు.

సూర్యాపేట(Suryapet) జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. మరో మహిళతో వివాహేతర సంబంధం(Extramarital affair) పెట్టుకొని భార్యను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు ఓ భర్త. మూడు నెలల తర్వాత ప్రియురాలి భర్తను చంపి, తనే ఉరివేసుకున్నట్లు చిత్రీకరించి నమ్మించబోయాడు ఓ వ్యక్తి. మోతె మండలం బళ్లు తండాకు చెందిన భూక్యా వెంకన్న(Bhukya Venkanna) కుటుంబంతో సూర్యాపేట భాగ్యనగర్‌ కాలనీలో ఉంటున్నాడు. నూతన్‌కల్‌ మండలం ఎర్రపహాడ్‌కు చెందిన షేక్‌ రఫీ(Shaik Rafi) తన భార్య నస్రీన్‌తో(Nasreen) కలిసి సూర్యాపేటలో భాగ్యనగర్‌ కాలనీలోనే కాపురం పెట్టారు. భూక్యా వెంకన్న, నస్రీన్‌ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరూ తమ జీవిత భాగస్వాములను అడ్డు తొలగించుకోవాలని స్కెచ్‌ వేశారు. ఇందులో భాగంగా ఏడాది జూన్‌ 8న రాత్రి భార్య రమాదేవితో కలిసి బళ్లుతండా నుంచి సూర్యాపేటకు బైక్‌పై బయల్దేరారు. దారిలో బైక్‌ను ఆపేసి భార్యను విద్యుత్‌ స్తంభానికి కొట్టి హత్య చేశాడు. ఆమె రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు నమ్మించాడు.

మూడు నెలల తర్వాత నస్రీన్‌ భర్త రఫీని చంపేందుకు పథకం పన్నారు. ఈనెల 9న రాత్రి 10.30కి రఫీ బయటకు వెళ్లగా వెంకన్నకు ఫోన్‌ చేసి నస్రీన్‌ సమాచారం ఇచ్చింది. వెంకన్న తన మిత్రులతో కలిసి రఫీ ఇంట్లోకెళ్లి దాక్కున్నారు. ఇంటికి వచ్చిన రఫీని అందరూ కలిసి హత్య చేశారు. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించేందుకు మెడక్‌ చున్నీ బిగించి ఫ్యాన్‌కు వేలాడదీశారు. రఫీ సోదరుడు సుభాన్‌ ఫిర్యాదుతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. నస్రీన్‌ కాల్‌ డేటా, ఆమె వ్యవహారశైలిని పరిశీలించిన తర్వాత అసలు విషయం బయటపడింది. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

అయితే ఈ ఇద్దరు చేసిన నిర్వాకానికి అటు వెంకన్న ఇద్దరు కూతర్లు, ఇటు నస్రీన్‌ కుమారుడు, కూతురు అనాథలయ్యారు.

Updated On 28 Oct 2023 1:08 AM GMT
Ehatv

Ehatv

Next Story