సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలకే ఫండ్స్‌ కుప్పలు తెప్పలుగా వచ్చిపడతాయి. ప్రతిపక్షాలకు విరాళాలు ఇవ్వడానికి ఎవరూ సిద్ధపడరు. ఇస్తే గిస్తే పార్టీ మీద అభిమానంతో ఇస్తారేమో! బీఆర్‌ఎస్‌ నిన్నటితో 22 ఏళ్లు పూర్తి చేసుకుని 23వ ఏట ప్రవేశించింది కదా! ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్(CM KCR) కీలక సమావేశం నిర్వహించారు కదా!

సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలకే ఫండ్స్‌ కుప్పలు తెప్పలుగా వచ్చిపడతాయి. ప్రతిపక్షాలకు విరాళాలు ఇవ్వడానికి ఎవరూ సిద్ధపడరు. ఇస్తే గిస్తే పార్టీ మీద అభిమానంతో ఇస్తారేమో! బీఆర్‌ఎస్‌ నిన్నటితో 22 ఏళ్లు పూర్తి చేసుకుని 23వ ఏట ప్రవేశించింది కదా! ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్(CM KCR) కీలక సమావేశం నిర్వహించారు కదా! ఇందులో పలు కీలక అంశాలను ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యేలకు, నేతలకు దిశానిర్దేశం చేయడమే కాకుండా, కొందరు ఎమ్మెల్యేలకు వార్నింగ్‌ ఇచ్చారు. పద్దతి మార్చుకోకుంటే టికెట్‌ దక్కదని స్పష్టం చేశారు. ఇవన్నీ పక్కన పెడితే మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా చెప్పారు గులాబీ బాస్‌. 767 కోట్ల రూపాయల బ్యాంక్‌ డిపాజిట్లతో కలిపి భారత రాష్ట్ర సమితి(BRS) దగ్గర 1,250 కోట్ల రూపాయల పార్టీ ఫండ్‌ ఉందన్నారు. వడ్డీల కింద నెలకు ఏడు కోట్ల రూపాయలు పార్టీ ఖాతాలో జమ అవుతుందని చెప్పారు. పార్టీ నిర్వహణకు, జిల్లాలలో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి, ప్రచారానికి, మౌలిక సదుపాయాల కల్పనకు అయ్యే ఖర్చులను వడ్డీల కింద వచ్చే ఆదాయంతోనే పెడుతున్నామని కేసీఆర్‌ అన్నారు. 2021 అక్టోబర్‌ 21న జరిగిన ప్లీనరీలో పార్టీ ఫండ్‌ కింద 425 కోట్ల రూపాయల విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయని, నెలకు రెండు కోట్ల రూపాయల వడ్డీ వస్తున్నదని చెప్పారు.

Updated On 28 April 2023 5:45 AM GMT
Ehatv

Ehatv

Next Story