వివిధ రాజకీయ పార్టీల్లోని అసంతృప్తులుగా ఉన్న నాయకులు, కార్యకర్తలు ఎవరైనా తమ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి రావాలనుకుంటే భారత చైతన్య యువజన పార్టీ (BCY) ఆహ్వానిస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బొడే రామచంద్ర యాదవ్(Bode Ramachandra Yadav) తెలిపారు. తెలంగాణ ఎన్నికల(TS Elections) సంగ్రామంలోకి దిగేందుకు బీసీవై పార్టీ సిద్దమైందన్నారు.

నవంబర్‌ 1వ తేదీన మేనిఫెస్టో విడుదల, అదే రోజు అభ్యర్థుల ప్రకటన

వివిధ రాజకీయ పార్టీల్లోని అసంతృప్తులుగా ఉన్న నాయకులు, కార్యకర్తలు ఎవరైనా తమ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి రావాలనుకుంటే భారత చైతన్య యువజన పార్టీ (BCY) ఆహ్వానిస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బొడే రామచంద్ర యాదవ్(Bode Ramachandra Yadav) తెలిపారు. తెలంగాణ ఎన్నికల(TS Elections) సంగ్రామంలోకి దిగేందుకు బీసీవై పార్టీ సిద్దమైందన్నారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 7 లో జర్నలిస్ట్ కాలనీ నందు తెలంగాణ బీసీవై పార్టీ కార్యాలయాన్ని బుధవారం రామచంద్ర యాదవ్ ప్రారంభిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తమ పార్టీకి మంచి అవకాశాలున్నాయని తెలిపారు.

అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు మొదలైందని, ఈ నెలాఖరు నాటికి అభ్యర్ధులను ప్రకటించి ఎన్నికల శంఖారావం పూరించనున్నామని తెలిపారు. బీసీవై పార్టీ రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా పని చేస్తుందని హామీ ఇచ్చారు. ఉచిత తాయిలాలు కాకుండా నిజమైన అభివృద్ధి ఏమిటో చూపిస్తామని అన్నారు. వ్యవసాయ(Agriculture) రంగ అభివృద్ధి, విద్యా విధానంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఎలా అభివృద్ధి పదంలో పయనింపజేయాలి, మహిళా అభివృద్ధికి ఏ విధంగా చేయాలనే దానిపై పూర్తి స్పష్టతతో నవంబర్ 1వ తేదీన మేనిఫెస్టో(Manifesto) విడుదల చేయడం జరుగుతుందని చెప్పారు.

అదే రోజు అభ్యర్ధుల ప్రకటన కూడా చేస్తామని తెలిపారు రామచంద్ర యావద్. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project) తెలంగాణకు అవసరమేననీ పేర్కొన్న రామచంద్ర యాదవ్ దానిలో జరిగిన అవినీతిని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర కమిటిని రెండు మూడు రోజుల్లో నేతలతో చర్చించి వెల్లడిస్తామని చెప్పారు. పొత్తుల విషయంపై ఇంత వరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అంటూనే తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీతో పొత్తుతో వెళ్లే ఆలోచన లేదనీ, ఒంటరిగానే బీసీవై పార్టీ పోటీ చేస్తుందని రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. ఇప్పటికే తమ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మేనిఫెస్టో విడుదల చేశామని, ఎక్కడా తాము ఉచిత పథకాల హామీలు ఇవ్వలేదన్నారు. ఉద్యోగ ఉపాది అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధికి ఏమి చేయాలి, మహిళల అభివృద్ధి, భద్రత కోసం ఏమి చేస్తామనే దానిపై పూర్తి స్పష్టతతో ముందుకు వస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో బీసీవై పార్టీని ఆవిర్భవించినప్పటికీ తెలంగాణలోనూ తమ పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను తెలంగాణ ప్రజలు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు.

బీసీవై పార్టీ అంటే ఒక వర్గానికో, కులానికో, ప్రాంతానికో పరిమితమైన పార్టీ కాదని అన్నారు. బలహీన వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యున్నతికి కోసం కృషి చేయడంతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే పోటీ చేయడం జరుగుతోందని, భవిష్యత్తులో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు విస్తరించే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాల ఓట్లు చీల్చడానికే బీసీవై పార్టీ వచ్చిందన్నారు. అన్నిరంగాల్లో తెలంగాణను ముందుకు తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో బీసీవై పార్టీ పని చేస్తుందన్నారు. తెలంగాణలో మెజార్టీ వర్గాలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారని అన్నారు రామచంద్ర యాదవ్. బీసీవై పార్టీ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లబోతున్నామని తెలిపారు. బీసీవై పార్టీ ముందు, వెనుక ఏ రాజకీయ పార్టీ నాయకులు లేరని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Updated On 26 Oct 2023 1:20 AM GMT
Ehatv

Ehatv

Next Story