గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌పై చాలా జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్‌ క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌పై చాలా జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్‌ క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా +94777 455913, +37127913091, +56322553736, +37052529259, +255901130460 ఇలాంటి నంబరుతో ఫోన్‌ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్‌ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ప్రధానంగా +371 (Latvia), +375 (Belarus), +381 (Serbia), +563 (lova), +370 (Lithuania), +255 (Tanzania) వంటి కోడ్‌లతో మొదలయ్యే నంబరుతో వచ్చే ఫోన్‌ కాల్స్‌ పట్ల చాలా చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. 'మీరు కాల్‌ లిఫ్ట్ చేసేలోపు హ్యాంగ్‌ చేస్తారు. మీరు కాల్‌ బ్యాక్‌ చేస్తే కాంటాక్ట్‌ జాబితాతోపాటు బ్యాంకు, క్రెడిట్‌ కార్డు ఇతర వివరాలు మూడు సెకన్లలో కాపీచేసుకుంటారు. ముఖ్యంగా #90 లేదా #09 నంబర్లను నొక్కాలని ఎవరైనా సూచిస్తే ఆ ప్రయత్నం చేయవద్దు. అలా చేస్తే మీ సిమ్‌ కార్డుని యాక్సెస్‌ చేయడానికి, మీ ఖర్చుతో కాల్‌ చేయడానికి, మిమ్మల్ని నేరస్థుడిగా చేయడానికి కుట్రపన్నుతున్నట్టు గ్రహించాలి' అని హైదరాబాద్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపారు.

ehatv

ehatv

Next Story