చదువుకుని చిన్నా చితక ఉద్యోగాలు(Jobs) చేసుకోవడం కంటే.. అడుక్కున్నోడు(Better) బెటర్‌ అంట.

చదువుకుని చిన్నా చితక ఉద్యోగాలు చేసుకోవడం కంటే.. అడుక్కున్నోడు బెటర్‌ అంట. అవును మనం నెలకు ఎంత సంపాదిస్తారు 25 వేలా.. 50 వేలా.. లక్షనా.. లక్షా 50 వేలా.. 2 లక్షలా..? పైగా మనకు వచ్చే ఆదాయంతో ఇంటి అద్దె, కుటుంబం, బిల్లులు, ఈఎంఐలు.. క్రెడిట్ కార్డుల బిల్లులతో సతమవుతాం. నెలాఖరుకు మనం కూడా ఒకరి దగ్గర చేయి చాపాల్సిందే. కానీ బిచ్చగాళ్లకు ఇవేవీ ఉండవు.. సంపాదనకు కొదవ లేదు.. తిండికి అంతకన్నా కొదవలేదు. బెగ్గర్‌ మాఫియాను(Beggermafia) అరికట్టేందుకు పలువురిని అదుపులోకి తీసుకొని విచారించాగా పోలీసులే షాక్‌ తింటున్నారు. కొందరు బిచ్చగాళ్లు అక్షరాలు 2 లక్షలకుపైనే సంపాదిస్తున్నారని తెలియడంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. హైద‌రాబాద్ నగరంలోని ట్రాఫిక్ జంక్షన్‌ల వద్ద భిక్షాటన చేసే కొన్ని కుటుంబాలు, అడుక్కునే వారు నెలకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలు, ఇంకా అంతకంటే వరకు సంపాదిస్తున్నారు.

హైదరాబాద్(Hyderabad), సైబరాబాద్, రాచకొండ(Rachakonda) కమిషనరేట్ల పరిధిలోని ప్రధాన కూడళ్ల వద్ద బిచ్చగాళ్ల కుటుంబాలు భిక్షాటన చేస్తాయి. రెడ్ సిగ్నల్‌ పడిన వెంటనే వాహనదారుల వద్దకు వచ్చి అమ్మా, అయ్యా అంటూ అడుక్కుంటూ ఉంటారు. వారిలో కొందరు కాళ్లు, చేతులు లేకుండా అంగవైకల్యంతో కూడిన వారు కూడా ఉంటారు. దయకలిగితే మనం ఐదో, పదో ఇస్తుంటాం. ఒక్కో సిగ్నల్ జంక్షన్(Trafficsignal) దగ్గర ఒక్కో కుటుంబం(familybegging) ఉంటుంది. అక్కడికి మరొకరిని రానివ్వరు. భార్యభర్తలు, నలుగురైదుగురు పిల్లలు, వృద్ధులతో సహా మొత్తం కుటుంబం ఒక జంక్షన్‌ను గుత్తాగా ఉంచేసుకుంటారు. అంటే అక్క‌డ వారు మాత్ర‌మే అడుక్కుంటారు. ఇతరులను అక్కడక భిక్షాట‌న చేయ‌డానికి రానివ్వ‌రు. ఇలాంటి కుటుంబాలు యావరేజ్‌గా రోజుకు రూ. 4,000 నుంచి రూ. 7,000 వరకు సంపాదిస్తారని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ముఖ్యంగా బడాబాబులు తిరిగే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్, మాసబ్ ట్యాంక్, అబిడ్స్ రోడ్, ప్యారడైజ్ జంక్షన్, ట్యాంక్ బండ్, కోఠి ఉమెన్స్ కాలేజ్, చాంద్రాయణగుట్ట, మెహిదీపట్నం వంటి ప్రైం జంక్షన్‌లకు ఈ కుటుంబాలు ప్రాధాన్యత ఇస్తాయి.

భిక్షాటన చేసే కుటుంబాలు ఉదయం 10 గంటలకు ఆటోల్లో వచ్చి రోజంతా సిగ్నళ్ల కూడళ్లలో అడుక్కుంటూ కనిపిస్తారు. రాత్రి ఆటోల ద్వారానే ఇళ్లకు చేరుకుంటారన్నారు. కొన్ని కుటుంబాలు వడ్డీ వ్యాపారం కూడా చేస్తున్నాయట. ఇంటికి చేరుకునే సమయంలో బిర్యానీ, మద్యం లేదా కల్లు తీసుకుంటారని పోలీసులు గుర్తించారు. కొందరు మాఫియాను ఏర్పాటు చేసి శారీరకంగా వికలాంగులు, పిల్లలు, వృద్ధులు, స్త్రీలను పనిలో పెట్టుకున్నార‌ని కూడా హైద‌రాబాద్ పోలీసులు గుర్తించారు. అడుక్కున్న వ‌చ్చిన మొత్తాన్ని తీసుకుని.. ఒక్కొక్కరికి 200 చొప్పున చెల్లిస్తున్నారు. ఆహారం, వసతిని నిర్వాహకులు కల్పిస్తున్నారు. మీ మాఫియా అడుక్కునే ప్రాంతాలను పంచుకున్నారని.. వివాదలు వస్తే కూర్చోని మాట్లాడుకుంటారట.

Updated On 8 Nov 2024 3:37 PM GMT
Eha Tv

Eha Tv

Next Story