భారత చైతన్య యువజన పార్టీ(BCY Party) కీలక సమావేశం రేపు తెలంగాణలో(Telangana) జరుగనున్నట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా రాజకీయ పార్టీని స్థాపించిన అధినేత రామచంద్ర యాదవ్(Ram chandra Yadav) ఏపీతో పాటు తెలంగాణలో కూడా పార్టీ కార్యకలాపాలను విస్తరించాలని భావిస్తున్నారు.
భారత చైతన్య యువజన పార్టీ(BCY Party) కీలక సమావేశం రేపు తెలంగాణలో(Telangana) జరుగనున్నట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా రాజకీయ పార్టీని స్థాపించిన అధినేత రామచంద్ర యాదవ్(Ram chandra Yadav) ఏపీతో పాటు తెలంగాణలో కూడా పార్టీ కార్యకలాపాలను విస్తరించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలో తెలంగాణలో పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సభలో బీఆర్ఎస్‌లో టికెట్ రాని పలువురు అసంతృప్త నేతలు పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
రామచంద్ర యాదవ్.. గత ఎన్నికల్లో జనసేన(Janasena) పార్టీ తరఫున పుంగనూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలి కాలంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులతో వివాదం జరిగింది. మంత్రి అనుచరులు యాదవ్ ఇంటిపై దాడిచేసిన ఘటన తర్వాత ఆయనకు కేంద్రం Y+ కేటగిరి భద్రత కూడా కల్పించింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తూ, సేవా కార్యక్రమాలు చేపట్టడాన్ని ఓర్వలేకే అధికార పార్టీ నాయకులు తనను అడ్డుకుంటున్నారని రామచంద్ర యాదవ్ పలుమార్లు ఆరోపించారు.