అక్టోబర్ 10న షాద్‌నగర్‌లో బీసీ బహిరంగ సభ నిర్వ‌హించ‌నున్న‌ట్లు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ హనుమంతరావు తెలిపారు. గాంధీ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..

అక్టోబర్ 10న షాద్‌నగర్‌(Shadnagar)లో బీసీ బహిరంగ సభ(BC Public Meeting) నిర్వ‌హించ‌నున్న‌ట్లు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ హనుమంతరావు(V Hanumantha Rao)తెలిపారు. గాంధీ భ‌వ‌న్‌(Gandhi Bhavan)లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ(Rahul Gandhi) కృషి చేస్తున్నారని.. అందులో భాగంగా బీసీ సభ నిర్వ‌హించ త‌ల‌పెట్టిన‌ట్లు వెల్ల‌డించారు. స‌భ‌కు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Siddharamaiah) ముఖ్య అతిదిగా గా విచేస్తున్నారని తెలిపారు. బీసీ సబ్ ప్లాన్(BC Sub Plan).. కుల గ‌ణ‌న.. జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు అమలు.. రాజకీయ ప్రాధాన్యం తదితర అంశాలపై చర్చ జ‌ర‌గాల‌ని.. బీసీ లకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ బహిరంగ సభను విజయవంతం చేయాల‌ని శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. బీసీ లు అండగా ఉంటేనే విజయం సాధిస్తామ‌న్నారు. బీసీలకు సంఖ్య పరంగా నిధుల కేటాయింపు జరగాలని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

అస‌దుద్దీన్(Asaduddin) వ్యాఖ్య‌ల‌పై హనుమంతరావు స్పందించారు. రాహుల్ గాంధీని హైదరాబాద్(Hyderabad) లో పోటీ చేయాలని అసదుద్దీన్ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని మండిప‌డ్డారు. అసదుద్దీన్ కేరళ(Kerala) లో పోటీ చేస్తారా అని ప్ర‌శ్నించారు.

Updated On 25 Sep 2023 10:56 AM GMT
Yagnik

Yagnik

Next Story