నల్లగొండ(Nalgonda) జిల్లా మాలియా పట్టణంలోని(Maliya patnam) తుమ్మడం బీసీ గురుకుల బాలికల పాఠశాలలో(BC Gurukul Girls School) విద్యార్థినులు ఆందోళన బాటపట్టారు

నల్లగొండ(Nalgonda) జిల్లా మాలియా పట్టణంలోని(Maliya patnam) తుమ్మడం బీసీ గురుకుల బాలికల పాఠశాలలో(BC Gurukul Girls School) విద్యార్థినులు ఆందోళన బాటపట్టారు. కుక్కల కన్నా దారుణంగా చూస్తున్నారని, కుక్కలకు ఇచ్చిన విలువ కూడా తమకు ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు. పురుగుల అన్నం పెడుతున్నారని దుఃఖంతో చెబుతున్నారు. తరగతి గదుల్లోకి వెళ్లకుండా ఆడిటోరియంలో కూర్చొని నాలుగు వందల మంది నిరసన చెబుతున్నారు. ఆకలితో అలమటిస్తున్నామంటూ ఏడుస్తున్నారు.

మధ్యాహ్నం భోజనంలో నిత్యం పురుగుల అన్నం, చికెన్, సాంబార్ లలో నీళ్లు ఉన్నాయని తినలేకపోతున్నామని చెబుతున్నారు. ఇదేమిటని అడిగితే ప్రిన్సిపాల్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఈ ప్రిన్సిపాల్‌ తమకు వద్దని కరాఖండిగా చెబుతున్నారు. ఈ ప్రిన్స్‌పాలే ఉంటే తాము మూకుమ్మడిగా టీసీ తీసుకుని వెళ్లిపోతామని అంటున్నారు.

Eha Tv

Eha Tv

Next Story