కరోనా కారణంగా గత మూడేళ్లుగా నిలిచిపోయిన చేప ప్రసాదం(Fish Prasadam) పంపిణీని మళ్లీ ప్రారంభిస్తున్నట్టు బత్తిని మృగశిర ట్రస్ట్‌(Bathini Mrigasira Trust) ప్రతినిధులు, బత్తిన కుటుంబసభ్యులు తెలిపారు. జూన్‌ తొమ్మిదో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి జూన్‌ పదో తేదీ ఉదయం ఎనిమిది గంటల వరకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తామని చెప్పారు బత్తిన అమర్‌నాథ్‌ గౌడ్‌. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌(Nampally Exhibition Grounds)లో కార్యక్రమం ఉంటుందని చెప్పారు.

కరోనా కారణంగా గత మూడేళ్లుగా నిలిచిపోయిన చేప ప్రసాదం(Fish Prasadam) పంపిణీని మళ్లీ ప్రారంభిస్తున్నట్టు బత్తిని మృగశిర ట్రస్ట్‌(Bathini Mrigasira Trust) ప్రతినిధులు, బత్తిన కుటుంబసభ్యులు తెలిపారు. జూన్‌ తొమ్మిదో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి జూన్‌ పదో తేదీ ఉదయం ఎనిమిది గంటల వరకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తామని చెప్పారు బత్తిన అమర్‌నాథ్‌ గౌడ్‌. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌(Nampally Exhibition Grounds)లో కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ప్రసాదం కోసం వచ్చే వారు నాలుగు గంటల ముందు నుంచి ఎలాంటి ఆహారం తీసుకోకూడదని ఆయన సూచించారు. అలాగే ప్రసాదం తీసుకున్న తర్వాత రెండు గంటల పాటు నిరాహారంగా ఉండాలని చెప్పారు. ఆస్తమా, దగ్గు, ఉబ్బసం వంటి దీర్ఘకాలిక శ్వాస సంబంధిత వ్యాధులకు గత 190 ఏళ్లుగా చేప ప్రసాదాన్ని అందిస్తున్నామని తెలిపారు.

ప్రతి సంవత్సరం మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు ఉచితంగా చేప ప్రసాదాన్ని ఇస్తారు బత్తిన కుటుంబసభ్యులు. కరోనా కారణంగా గత మూడేళ్ల నుంచి ఈ కార్యక్రమం నిలిచిపోయింది. ఈ ఏడాది నుంచి చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. కిలోమీటర్ల మేర క్యూలు ఉంటాయి. మూడేళ్ల తర్వాత మళ్లీ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఈసారి జనం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది

Updated On 26 April 2023 2:28 AM GMT
Ehatv

Ehatv

Next Story