ఇటీవల తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచిన బర్రెలక్క పేరు తెలుగు రాష్ట్రాల ప్రజల నోళ్లలో నానుతుంది. ఈ క్రమంలోనే రాజకీయపరమైన ఏ టాఫిక్ వచ్చినా ఆమె ప్రస్తావన వస్తుంది.
ఇటీవల తెలంగాణ ఎన్నికల(Telangana Elections) బరిలో నిలిచిన బర్రెలక్క(Barrelakka) పేరు తెలుగు రాష్ట్రాల ప్రజల నోళ్లలో నానుతుంది. ఈ క్రమంలోనే రాజకీయపరమైన ఏ టాఫిక్ వచ్చినా ఆమె ప్రస్తావన వస్తుంది. ఇటీవల పలాస బహిరంగ సభ(Palasa Meeting)లో ఏపీ సీఎం వైఎస్ జగన్(CM Jagan) తెలంగాణ ఎన్నికల గురించి మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. తెలంగాణలో పోటీ చేసి పవన్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణలో పవన్(Pawan Kalyan) డైలాగులు కొట్టారని, ఆఖరికి ఆయనకు డిపాజిట్లు రాలేదని అన్నారు. ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదన్నారు. ఆయన ఒక నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్(Non Local Package Star) అని సీఎం జగన్ విమర్శించారు .
ఈ వ్యాఖ్యలపై బర్రెలక్క మాట్లాడుతూ.. ఎవరి పార్టీ వారిది, ఎవరి రాజకీయ జీవితం వారిదని బర్రెలక్క చెప్పింది. పవన్ కళ్యాణ్‌ను తక్కువచేసి మాట్లాడటం బాధగా అనిపించిందని అన్నారు. ఆయన పవర్ ఆయనది.. నా పవర్ నాదని తెలిపింది. తాను కూడా పవన్ కళ్యాణ్ అభిమానిని అని చెప్పుకొచ్చింది. ఆయన ఎంత మంచి వ్యక్తో జనాలకు తెలుసని అన్నారు. ఆయనను తక్కువ చేసి మాట్లాడటం కోసం తనతో పోల్చడం బాధగా ఉందన్నారు.