బర్రెలక్క అలియాస్‌ శిరీష(Barrelakka Sirisha), పల్లవి ప్రశాంత్‌(Pallavi Prashanth)..సోషల్ మీడియా(Social Media) పుణ్యానా వీరిద్దరు తెగ పాపులరయ్యారు. ఆ పాపులారిటీతోనే బర్రెలక్క ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections 2024) ఇండిపెండెంట్‌గా పోటీ కూడా చేశారు. ఆమెకు అయిదువేల కంటే ఎక్కువ ఓట్లు రావడం విశేషం.

బర్రెలక్క అలియాస్‌ శిరీష(Barrelakka Sirisha), పల్లవి ప్రశాంత్‌(Pallavi Prashanth)..సోషల్ మీడియా(Social Media) పుణ్యానా వీరిద్దరు తెగ పాపులరయ్యారు. ఆ పాపులారిటీతోనే బర్రెలక్క ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections 2024) ఇండిపెండెంట్‌గా పోటీ కూడా చేశారు. ఆమెకు అయిదువేల కంటే ఎక్కువ ఓట్లు రావడం విశేషం. ఇక పల్లవి ప్రశాంతేమో బిగ్‌బాస్‌ హౌస్‌లో రైతు బిడ్డగా అడుగుపెట్టాడు. టైటిల్ గెల్చుకున్నాడు. ఆ విజయానందంలో బయటకొచ్చి నానా హంగామాచేశాడు. జైలు పాలయ్యాడు. పల్లవి ప్రశాంత్‌కు, బరెలక్క శిరీషకు బీరకాయపీచు సంబంధం కూడా లేదు. ఇద్దరికి పరిచయం కూడా లేదు. ఓ సామాన్యుడు బిగ్‌బాస్‌(Bigg Boss)లో ఎంటరయ్యాడు కదా అని చెప్పి మద్దతుగా నిలిచింది. సోషల్‌ మీడియా అదిగో పులి అంటే ఇదిగో తోక అనే రకం కదా! అంతే ప్రశాంత్‌, శిరీష మధ్య తప్పుడు వరసలు అంటగట్టారు కొందరు నెటిజన్లు. త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే కథనాలు సోషల్‌ మీడియాలో వచ్చాయి. కొందరు వీరి పెళ్లి అయిపోయినట్టుగా మార్ఫింగ్‌ ఫోటోలో పెట్టారు. ఈ కథనాలపై బర్రెలక్క మండిపడ్డారు. ఇలాంటి వార్తలను పుటిస్తున్నవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నేను అసలు బిగ్‌బాస్‌ను చూడు. ఏడో సీజన్‌లో ఓ రైతు బిడ్డ హౌస్‌లో ఎంటరయ్యాడని తెలుసుకుని రెండు మూడు ఎపిసోడ్లు చూశానంతే. ఎమ్మెల్యేగా పోటీ చేసే హడావుడిలో బిగ్‌బాస్‌ షోను చూడటం కుదరలేదు. మళ్లీ ఫైనల్‌ రోజు చూశాను. నేను ఎప్పుడూ ప్రశాంత్‌కు ఫోన్‌ చయలేదు. అటువంటిది నాకు తెలియకుండానే పల్లవి ప్రశాంత్‌ అన్నతో యూట్యూబ్‌లో నా పెళ్లి చేసేశారు. నా పెళ్లికి పెద్ద పెద్ద అతిథులు కూడా వచ్చారట. ఆ సంగతే నాకు తెలీదు. వ్యూస్‌ కోసం ఇంతలా బరితెగిస్తారా? ఎవరు మట్టిలో కలిస్తే ఏంటి? ఎవరి ఇజ్జత్‌ పోతే ఏంటి? ఎవరి జీవితం నాశనమైతే ఏంటి? మాకు వ్యూస్‌ కావాలంతే అన్నట్లుగా ఫోటోలు మార్ఫింగ్‌ చేసి మరీ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. చాలా వీడియోలలో నేను పల్లవి ప్రశాంత్‌ను అన్న అని పిలిచాను. ఎవరైనా అన్నను పెళ్లి చేసుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది బర్రెలక్క శిరీష.

Updated On 31 Jan 2024 5:13 AM GMT
Ehatv

Ehatv

Next Story