బర్రెలక్కగా(Barrelakka) ఫేమస్ అయిన కర్నె శిరీష(Sirisha) నిరుద్యోగుల గళమెత్తి పాపులరయ్యారు.
బర్రెలక్కగా(Barrelakka) ఫేమస్ అయిన కర్నె శిరీష(Sirisha) నిరుద్యోగుల గళమెత్తి పాపులరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సోషల్ మీడియాలో(social media) వెల్లువెత్తారు. ఇప్పుడామె ఓ సెలబ్రిటీ. పాపం ఆమెకు ఇప్పుడు ఎనలేని కస్టం వచ్చిపడింది. ఆమె పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ పేజీలు, ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీలు, ఫేక్ యూ ట్యూబ్ ఛానెళ్లు క్రియేట్ చేస్తున్నారని చెబుతూ బోరుమని ఏడ్చారు బర్రెలక్క. తనకు ఏ పాపం తెలియదని, తనకు ఎలాంటి సంబంధమూ లేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంతకీ ఏం జరిగిదంటే బర్రెలక్క తన ఫేస్ బుక్ అకౌంట్(Fake account) ద్వారా ఓ వ్యక్తి దగ్గర్నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిందంటూ ఓ ప్రముఖ కన్నడ ఛానెల్‌లో వార్త వచ్చింది. ఈ వార్తలో బర్రెలక్క ఫోటోతో పాటు పేరును కూడా ప్రస్తావించారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అటు తిరిగి ఇటు తిరిగి బర్రెలక్క చెంతకు కూడా ఈ వీడియో చేరింది. అది షాక్ తిన్న బర్రెలక్కకు ఏం చేయాలో పాలుపోలేదు. తనపై వచ్చిన ఫాల్స్ న్యూస్‌కు ఎలా కౌంటర్ ఇవ్వాలో తెలియక కన్నీళ్లు పెట్టుకున్నారు. అసలు ఆ వార్తకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను ఎవరి దగ్గర పైసా కూడా తీసుకోలేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను విడుదల చేస్తూ తన ఆవేదనను వ్యక్తం పరిచారు. 'ఇప్పుడే ఓ న్యూస్ చూసినా.. ఇదే ఏ ఛానలో కూడా తెలియట్లేదు. ఏదో కన్నడ ఛానల్ అని తెలుస్తుంది. ఇలాంటి ఫేక్ న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఫేస్ బుక్‌లో చాట్ చేసి డబ్బులు దొబ్బేసిందని వార్తలు వేస్తున్నారు. నాకు ఏం అర్థమవ్వడం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారో. నేను ఫేస్ బుక్‌లో చాట్ చేసి డబ్బులు వసూలు చేశానట! వాడెవడో ముసలోడు. అతనెవరో కూడా నాకు తెలియదు. నామీద ఎందుకిలా బ్యాడ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నాడో తెలియదు. పెళ్లి చేసుకుని నా జీవితం నేను బతుకుతుంటే.. నా జీవితంతో ఆడుకుంటున్నారు. నాకు సంబంధం లేదు. నా జీవితంతో ఎందుకిలా ఆడుకుంటున్నారు? నా పేరు మీద ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫేక్ అకౌంట్లున్నాయి. అందులో ఎవరు వసూలు చేశారో తెలియదు. నాకే తప్పు తెలియదు.. అనవసరంగా నన్ను బ్లేమ్ చేయకండి. ప్లీజ్' అంటూ కన్నీటితో వేడుకున్నారు బర్రెలక్క. దీనిపై పోలీసు అధికారికి ఫిర్యాదు కూడా చేశారు. తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని, ఫేక్ వీడియోలను తొలగిస్తామని పోలీసులు ఇచ్చిన హామీతో బర్రెలక్క కాస్త ఊరట చెందారు.