బర్రెలక్కగా(Barrelakka) ఫేమస్ అయిన కర్నె శిరీష(Karne Sirisha) త్వరలోనే పెళ్లి(Marriage) పీటలు ఎక్కబోతుంది. తాను పెళ్లి చేసుకోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ఆమె వెల్లడించింది. 2022 డిసెంబర్‌లో ఆమె బర్రెలను మేపుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఉద్యోగాలు రావడం లేదని, అందుకే బర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నానని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. రాష్ట్రంలో అప్పుడు నిరుద్యోగులకు, ప్రభుత్వ వ్యతిరేకులకు ఇదొక ఆయుధంగా మారి ఈ వీడియోను ట్రెండింగ్‌లోకి తెచ్చారు.
బర్రెలక్కగా(Barrelakka) ఫేమస్ అయిన కర్నె శిరీష(Karne Sirisha) త్వరలోనే పెళ్లి(Marriage) పీటలు ఎక్కబోతుంది. తాను పెళ్లి చేసుకోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ఆమె వెల్లడించింది. 2022 డిసెంబర్‌లో ఆమె బర్రెలను మేపుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఉద్యోగాలు రావడం లేదని, అందుకే బర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నానని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. రాష్ట్రంలో అప్పుడు నిరుద్యోగులకు, ప్రభుత్వ వ్యతిరేకులకు ఇదొక ఆయుధంగా మారి ఈ వీడియోను ట్రెండింగ్‌లోకి తెచ్చారు. వీడియో వైరల్ కావడంతో ఆమె పేరు బర్రెలక్కగా ముద్రపడిపోయింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీగా మారిపోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో బర్రెలక్క పేరు వైరల్‌గా మారింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(TS elections) సందర్భంగా ఆమె కొల్లాపూర్(Kollapur) నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 5754 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. అయితే ఈ మధ్య కాలంలో బర్రెలక్క వివాహంపై కూడా వార్తలు వచ్చాయి. బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను(Pallavi Prashant) పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు రావడంతో ఆమె ఖండించారు. ప్రశాంత్ తనకు అన్నయ్య లాంటి వాడని చెప్పడంతో ఈ వార్తలకు తెరపడింది. ఇక తాజాగా పెళ్లి గురించి ఆమె ఆధికారికంగా వెల్లడించడంతో నిశ్చితార్థం జరిగినట్లు వీడియోలో పేర్కొంది. తన నిశ్చితార్థం సడెన్‌గా సెట్ అయిందని.. అందుకే ఎవరినీ పిలువలేకపోయానని వీడియోలో తెలిపింది. అయితే తన భర్త గురించి వివరాలను బయట పెట్టలేదు.