ప్రజా ఉద్యమాలు చేస్తేనో, పాదయాత్రలు చేస్తేనో పాలిటిక్స్‌లో(Politics) సక్సెస్‌ కారు. సింపుల్‌గా సోషల్‌ మీడియాలో(social Media) చిన్న చిన్న రీల్స్‌ చేసుకుంటే చాలు.. అటోమాటిక్‌గా ఫేమస్‌ అయిపోవచ్చు. ఆ ఫేమ్‌లో పదో పరకో ఓట్లు సాధించుకోవచ్చు.

ప్రజా ఉద్యమాలు చేస్తేనో, పాదయాత్రలు చేస్తేనో పాలిటిక్స్‌లో(Politics) సక్సెస్‌ కారు. సింపుల్‌గా సోషల్‌ మీడియాలో(social Media) చిన్న చిన్న రీల్స్‌ చేసుకుంటే చాలు.. అటోమాటిక్‌గా ఫేమస్‌ అయిపోవచ్చు. ఆ ఫేమ్‌లో పదో పరకో ఓట్లు సాధించుకోవచ్చు. సీపీఎం(CPM) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(Thammineni Veerabadram) సంగతే తీసుకోండి. ఆ ప్రముఖ నాయకుడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. మరోవైపు చిన్న రీల్‌తో బర్రెలక్కగా(Barrelakka) బాగా పాపులరైన కర్నె శిరీష(Sirisha) కూడా ఎన్నికల గోదాలో దిగారు. ఇద్దరూ వేరే వేరే నియోజకవర్గాల నుంచి పోటీ పడినప్పటికీ ఇద్దరికీ పోలిక పెడుతున్నారు. అందుకు కారణం శిరీష కంటే వీరభద్రానికి తక్కువ ఓట్లు రావడం. ఖమ్మం(Khammam) జిల్లా పాలేరు(Paleru) నుంచి పోటీ చేసిన వీరభద్రానికి 5,308 ఓట్లు వచ్చాయి. పాపం ఆయనకు డిపాజిట్‌ కూడా రాలేదు. ఇక మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌(Kollapur) నుంచి ఇండిపెండెంట్‌గా బరిలో దిగిన బర్రెలక్కకు 5,754 ఓట్లు లభించాయి. అంటే వీరభద్రానికి కంటే బర్రెలక్కకు 446 ఓట్లు ఎక్కువొచ్చాయన్నమాట! తమ్మినేని సొంత ఊరు తెల్దారుపల్లిలో కూడా ఆయనకు పెద్దగా ఓట్లు పడలేదు. ఆ గ్రామంలో మొత్తం 3,325 ఓట్లు ఉంటే కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 2.030 ఓట్లు వచ్చాయి. తమ్మినేనికి 665 ఓట్లు, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డికి 246 ఓట్లు వచ్చాయి.

Updated On 5 Dec 2023 2:06 AM GMT
Ehatv

Ehatv

Next Story