తెలంగాణలో ఎండ వేడిమి కొనసాగుతోంది, హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తెలంగాణలో ఎండ వేడిమి కొనసాగుతోంది, హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం నాడు నల్గొండ జిల్లాలోని తీక్యా తండాలో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాజధాని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీచాయి. బంజారాహిల్స్‌లో 43 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత నమోదవగా.. కొత్తపేటలోని మారుతీ నగర్, మెట్టుగూడలో 42.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చాలా ప్రాంతాలలో మధ్యాహ్న సమయానికి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్‌ను తాకడంతో నగరం వేడితో అల్లాడిపోయింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) హైదరాబాదులో రాబోయే మూడు రోజులు వాతావరణాన్ని అంచనా వేసింది, గరిష్ట ఉష్ణోగ్రతలు 39 నుండి 41 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయని పేర్కొంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 26 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో రానున్న మూడు రోజులలో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు 38 నుండి 43 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండవచ్చుని.. కనిష్ట ఉష్ణోగ్రతలు 25 నుండి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చని అంచనా వేసింది.