సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్(Bandla Ganesh) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఆయన తాజాగా చేసిన పోస్టు వైరల్ అవుతోంది. ఇటీవల పాలిటిక్స్‌లోకి(politics) పునరాగమనం చేస్తానన్న ఆయన.. ‘అన్నా వస్తున్నా’ అంటూ మరో ట్వీట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్(Congress) నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్’ (Peoples March)పాదయాత్రలో పాల్గొంటున్న విషయం తెలిసిందే.

Bandla Ganesh Tweet
సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్(Bandla Ganesh) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఆయన తాజాగా చేసిన పోస్టు వైరల్ అవుతోంది. ఇటీవల పాలిటిక్స్‌లోకి(politics) పునరాగమనం చేస్తానన్న ఆయన.. ‘అన్నా వస్తున్నా’ అంటూ మరో ట్వీట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్(Congress) నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్’ (Peoples March)పాదయాత్రలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. పీపుల్స్ మార్చ్’ పాదయాత్రలో భట్టిని కలిసేందుకు సూర్యాపేట(Suryapet) వెళ్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.
‘‘అన్నా.. వస్తున్నా.. అడుగులో అడుగేస్తా.. చేతిలో చెయ్యేస్తా. కాంగ్రెస్ కోసం.. పార్టీ అధికారం కోసం అన్నిటికీ సిద్ధపడి తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ఈ అద్భుతమైన పాదయాత్రలో పాలుపంచుకోవడానికి, మిమ్మల్ని కలవడానికి సూర్యాపేటకు వస్తున్నా జై కాంగ్రెస్.. జైజై కాంగ్రెస్’’ అంటూ బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు.
ఇదిలావుంటే.. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండ్ల గణేశ్ కాంగ్రెస్(Congress) పార్టీ కండువా కప్పుకున్నారు. ఎన్నికలలో పోటీ చేయాలని భావించారు.. కానీ టికెట్ దక్కలేదు. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తాజాగా రీ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం తీసుకుంటానన్న బండ్ల గణేశ్.. నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా, ధైర్యంగా, పౌరుషంగా, పొగరుగా రాజకీయాలు చేస్తానని ప్రకటించారు.
అన్నా వస్తున్నా అడుగులో అడిగేస్తా చేతిలో చెయ్యేస్తా కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అన్నిటికీ సిద్ధపడి తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ఈ అద్భుతమైన పాదయాత్రలో పాలుపంచుకోటానికి మిమ్మల్ని కలవడానికి సూర్యాపేటకు వస్తున్నాను. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్… https://t.co/ZTmWiMcCaL
— BANDLA GANESH. (@ganeshbandla) June 25, 2023
